సక్సస్ఫుల్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మింస్తున్న చిత్రం RRR. ఈ చిత్రం ఇప్పటికే రెండు టిజర్లను రీలిజ్ చేసింది. ఈ చిత్రంలో సీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తుండగా.. కొమురం భీంగా ఎన్టీఆర్ నటిస్తున్నాడు. మొదటి టీజర్లో రామ్ చరణ్ పాత్ర సీతారామరాజు టీజర్‌కు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వగా, కొమురం భీంగా ఎన్టీఆర్ పాత్ర టీజర్‌కు రామ్ చరణ్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. 8 నెలల క్రింద రిలిజ్ అయిన సీతారామరాజు టీజర్‌కు 36 మిలియన్ వ్యూస్ రాగా, ఒక నెల క్రింద రీలిజ్ అయిన కొమురం భీం టీజర్‌కు 34 మిలియన్ వ్యూస్‌కు చేరుకుంది.
ఫిక్షన్ స్టోరీగా జక్కన్న తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి విజయేంద్రప్రసాద్ కథ రాయగా కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. రెండు టీజర్ల లోనూ సాయి మాధవ్ బుర్ర రాసిన డైలాగ్స్ మెగా, నందమూరి ఫ్యాన్‌ను బాగా ఆకర్షించాయి. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న సెంథిల్ కుమార్ తన అద్భుత పనితనాన్ని కనపరచడంతో సినిమా మీద ఫాన్స్‌కు, వీక్షకులకు రెండు ట్రైలర్లు బాగా నచ్చాయి. లాక్ డౌన్ తరువాత షూటింగ్లో వేగం పెంచిన డైరెక్టర్ రాజమౌళి అలియా – రామ్ చరణ్ మధ్య మహాబలేశ్వర్‌లోని సుందర ప్రాంతాలలో షూటింగ్ షూరు చేశారు. అటు ఎన్టీఆర్‌కు జోడిగా హాలీవుడ్ భామ ఒలీవియా మోరిస్ నటించనుంది.
ఇది ఇలా ఉండగా ఈ మధ్యే ఆలియా ఆర్ఆర్ఆర్ సెట్స్‌లో రావడంతో సుశాంత్ ఫ్యాన్స్ ట్రోల్స్ గట్టిగానే చేస్తున్నారు. ఆలియా ఏ సినిమా చేసినా, తనకు ఎవరు అవకాశం ఇచ్చిన .. ఫలితం మాత్రం డిజాస్టర్ అని హెచ్చరిస్తున్నారు. తన కుటుంబం హిందూలకు, హిందూ తత్వలను ద్వేషిస్తాయని, తను సీత అనే రోల్ చేయడానికి అనర్హురాలని, ‘బాయ్‌కాట్ ఆలియా భట్’అంటూ ట్విట్టర్లో ట్రెండ్ చేస్తున్నారు. డిజాస్టర్‌గా మిగిలిపోతుందని మౌళి గారు అలియా తప్ప వేరే హిరోయిన్స్ దొరకలేదా, తనను తొలగించండి అంటూ ‘ఆర్ఆర్ఆర్’టీమ్‌కు వార్నింగ్ ఇస్తున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!