డిఫరెంట్ కథలు, పాత్రలను ఎంచుకుని సినిమాలు చేస్తున్న హీరో రానా. ఈయనకు ఆరోగ్యం కొన్నిరోజుల నుండి బాగా లేదు. కిడ్నీ సమస్యతో బాధపడ్డారు. అయితే అమెరికాలో కొన్నిరోజుల పాటు ట్రీట్మెంట్ కూడాతీసుకున్నారు. అయితే చివరకు డాక్టర్ల సలహా మేర కిడ్నీ సంబంధిత ఆపరేషన్ను విజయవంతంగా ముగించారట అమెరికన్ డాక్టర్స్. ఐదారు రోజుల క్రితం ఈ ఆపరేషన్ జరిగిందట. ప్రస్తుతం రానా రెస్ట్ తీసుకుంటున్నారని, మూడు నెలల్లో మళ్లీ షూటింగ్లకు హాజరవుతారని సినీ వర్గాల్లో వార్తలు. ప్రస్తుతం ఈయన తెలుగు, తమిళ, హిందీ భాషల్లో `హథీ మేరీ సాథీ` సినిమాను రీమేక్ చేస్తున్నారు. అలాగే `విరాటపర్వం` సినిమా చిత్రీకరణ చేయాల్సి ఉంది.
previous post
next post
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!