కొత్త ఇల్లు కొన్న మిస్ ఇండియా నటి..!

నటి పూజిత పొన్నాడ 2016వ సంవత్సరంలో “తుంటరి” అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. తర్వాత రంగస్థలం ఆది పినిశెట్టి లవర్ గా నటించిన పూజిత అందరికీ గుర్తుంటుంది. పూజిత ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు నాలుగు సంవత్సరాలు అవుతున్న, ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం లేదని చెప్పవచ్చు.

రంగస్థలం సినిమాలో లంగా వోని ధరించి ఎంతో సాంప్రదాయబద్ధంగా నటించిన పూజిత తర్వాత కల్కి సినిమా లో పవర్ ఫుల్ ఎస్సైగా నటించారు. తరువాత తాజాగా కీర్తి సురేష్ నటించిన మిస్ ఇండియా చిత్రంలో కూడా పూజిత కనిపించారు.ఇండస్ట్రీలో ఆమెకు పెద్దగా అవకాశాలు రానప్పటికీ ఆర్థికంగా ఎంతో నిలదొక్కుకున్నారనే చెప్పవచ్చు. పూజిత ఒకవైపు సినిమాలలో నటిస్తూ మరోవైపు వెబ్ సిరీస్ లో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇలా వచ్చిన ఈ అవకాశాన్ని వదలకుండా నటిస్తున్న పూజిత గ్లామర్ షో లలో చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు ఆమె తన ఇన్స్టాగ్రామ్ ద్వారా పోస్ట్ చేసిన ఫోటోలను చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. ప్రస్తుతం యూట్యూబ్ స్టార్ట్ గా పేరు సంపాదించుకున్న పూజిత అమ్మానాన్నలతో కలిసి ఓ ట్రెడిషనల్ లుక్ లో ఉన్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అయితే పూజిత పొన్నాడ తాజాగా కొత్త ఇంటిని కొని గృహప్రవేశం చేసినట్లు తెలుస్తోంది. మామూలుగా మోడరన్ డ్రెస్ లో కనిపించే పూజిత ఒక్కసారిగా ఇలా సాంప్రదాయ దుస్తులలో కనిపించింది. గృహప్రవేశం అనేది ఒక సాంప్రదాయబద్ధంగా జరిగే శుభకార్యం కాబట్టి పూజిత తెలుగుదనం ఉట్టిపడేలా చీరను ధరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోను చూసిన సదరు నెటిజన్లు ట్రెడిషనల్ లుక్ లో ఎంతో అందంగా ఉన్నావని కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇటీవల తన పెళ్లి చేసుకుంటుందని వచ్చిన వార్తలు కేవలం అపోహలు అని పూజిత తెలియజేశారు.