విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం ‘డియర్ కామ్రేడ్’. ఈ చిత్రానికి భరత్ కమ్మ దర్శకుడు. మైత్రి మూవీ మేకర్స్, బిగ్ బెన్ పతాకాలపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, సి.వి.మోహన్, యష్ రంగినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శుక్రవారం హీరోయిన్ రష్మిక మందన్న పుట్టినరోజును పురస్కరించుకొని సినిమాలోని ఆమె లుక్‌ను ట్విట్టర్ వేదికగా విజయ్ దేవరకొండ విడుదల చేశారు. ‘డియర్ లిల్లీ.. ఊరికే అలా అన్నాం. మాపై అలగకు. సెట్స్‌లో నువ్వు నీ పెర్ఫార్మెన్స్తో మమ్మల్ని రోజంతా నవ్విస్తూనే ఉంటావు. ఈ నెల 8న ఉదయం 11.11 గంటలకు విడుదలయ్యే తొలి పాటను నీకే అంకితమిస్తున్నాం. హ్యాపీ బర్త్‌డే డియర్ లిల్లీ’ అని సరదాగా కూడా క్యాప్షన్ ఇచ్చారు. దానికి రష్మిక సమాధానమిస్తూ ‘‘థాంక్ గాడ్ ఇప్పటికైనా పోస్టర్ బయటికి వచ్చింది. ధన్యవాదాలు. త్వరలో నేను పాట వినబోతున్నాను’ అని ట్వీట్ చేశారు.
previous post
next post
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!