Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందనా ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉంది. ఈ బ్యూటీ తన అందాలతో యువకుల్లో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. తన అందం, నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఇక సోషల్ మీడియాలో కూడా రష్మికకు భారీ ఫాలోయింగ్ ఉంది. ఈ అమ్మడి పేరిట సోషల్ మీడియాలో అనేక పేజీలు, గ్రూప్స్ ఉన్నాయి. ఆ పేజీ, గ్రూపుల్లో ఆమె లేటెస్ట్ సినిమాలు, ఫొటోలు షేర్ చేస్తూ రష్మిక క్రేజ్ ను పెంచుతున్నారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Rashmika: సోషల్ మీడియాలో యాక్టివ్
అయితే రష్మిక మందన్నా తెలుగుతో పాటు సౌత్ ఇండియాలోని అన్ని భాషల్లో నటిస్తోంది. అన్ని సినిమా ఇండస్ట్రీలో తన నటన, అందంతో ప్రేక్షకులను సంపాదించుకుంది. ఇక బాలీవుడ్ లో కూడా ఈ అమ్మడు ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా రాణిస్తోంది. ప్రస్తుతం హిందీలో కూడా పలు సినిమాలు చేస్తోంది.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
మరో వీడియోతో సోషల్ మీడియాలో క్రేజ్
అయితే రష్మిక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ ఉంటుంది. తన సినిమాలకు సంబంధించిన ఫొటోలను షేర్ చేయడంతో పాటు ఫొటోషూట్ల ఫొటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తన డ్యాన్స్ వీడియోలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ ఉంటుంది. అయితే తాజాగా మరో వీడియోను రష్మిక మందన్నా షేర్ చేసింది.
ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేసిన నేషనల్ క్రష్
మై మనీ డోంట్ జిగిల్ జిగిల్ డ్యాన్స్ ఛాలెంజ్ లో తన సొంత ట్విస్ట్ ను ప్లాన్ చేసింది. ఈ వీడియోలో కళ్లజొడు ధరించి రష్మిక సూపర్బ్ గా డ్యాన్స్ చేసింది. తన లవ్లీ లుక్స్ తో ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేసింది. పుష్ప సినిమాలోని సామీ సామీ హుక్ స్టెప్ ని దీని కోసం రష్మిక మందన్నా ట్రై చేయడం ఇంట్రస్టింగ్ గా మారింది. ఇక ఆమె తాళ్లతో చుట్టి కనిపించడంతో ఇది మరింత ఆసక్తిని రేకెత్తించింది.
షూటింగ్ మధ్యలో వీడియో చేశారా?
ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. హార్ట్ సింబల్స్ పెడుతూ రష్మిక డ్యాన్స్ చాలా బాగుందని నెటిజన్లు కామెంట్స్ పెడుతన్నారు. రష్మిక మందన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీబిజీగా ఉంది. ఏదైనా సినిమా సెట్స్ లో షూటింగ్ మధ్యలో ఈ వీడియో ట్రై చేసినట్లు తెలుస్తోంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!