Ravi teja: మాస్ మహా రాజా ఇటీవలే ఓ క్రేజీ మూవీ చేసేందుకు ఒప్పుకున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇంకా ఇది అఫీషియల్ కన్ఫర్మేషన్ కాకపోయినా కూడా దాదాపు ఈ ప్రాజెక్ట్‌లో మన మాస్ మహారాజ రవితేజ నటిస్తున్నాడని మాత్రం సమాచారం. ఆ సినిమా మరేదో కాదు. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కమిటయిన చిత్రాలలో ఒకటి. మెగాస్టార్ చిరంజీవితో దాదాపు 22 ఏళ్ల క్రితం వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన అన్నయ్య సినిమాలో రవితేజ నటించిన సంగతి తెలిసిందే. ఇందులో రవితేజ చిరుకు తమ్ముడుగా నటించాడు.
ఈ సినిమా 2000 సంవత్సరంలో వచ్చింది. మళ్ళీ ఇప్పుడు అంటే రెండు దశాబ్దాల తర్వాత మెగాస్టార్ చిరంజీవి – బాబీ కాంబినేషన్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ఈ సినిమాను పక్కా మాస్ ఎంటర్టైనర్గా దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్నాడు. షూటింగ్ మొదలైన ఈ సినిమా ఇప్పటికే 40 శాతం టాకీ పార్ట్ కూడా పూర్తైందట. త్వరలో ఈ మాస్ ఎంటర్టైనర్ షూటింగ్లో మెగా మాస్ హీరో
చిరు, మాస్ మహారాజా రవితేజ జాయిన్ కానున్నట్టు తెలుస్తోంది.
Ravi teja: రవితేజ చేతిలో ఇప్పుడు అరడజను సినిమాలున్నాయి.
గతంలో శంకర్ దాదా సిరీస్‌లో నటించమని చిరు స్వయంగా రవితేజను అడగగా..అప్పుడు వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉండి కుదరలేదు.. అని వార్తలు వచ్చాయి. ఎట్టకేలకు 22 ఏళ్ళకి మాస్ హీరోలు కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారట. ఇక వైజాగ్ బ్యాగ్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ప్రస్తుతం వాల్తేరు వీరయ్య అనే మాంచి మాసీ టైటిల్‌ను చిత్రబృందం పరిశీలిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. కాగా, రవితేజ చేతిలో ఇప్పుడు అరడజను సినిమాలున్నాయి. చిరు 5 ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నారు. ఇద్దరి సినిమాలు కనీసం రెండేసైనా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నాలు గట్టిగానే జరుగుతున్నాయి
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!