Pawan kalyan – RGV: సంచలన దర్శకుడు, వివాదాల వర్మ..ఎప్పుడు ఎవరిని టార్గెట్ చేసి ట్వీట్స్ పెడతారో ఎవరికీ తెలీదు. ఆయన చేసే కొన్ని ట్వీట్స్ సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపుతుంటాయి. వీళ్ళు వాళ్ళు అని కాకుండా వర్మకు ఆ సమయంలో ఎవరు కనిపిస్తే వారిని ట్వీటేస్తుంటాడు. కాస్త లోతుగా ఆలోచిస్తే బుర్రన్న వాళ్ళకు నా ఇంటెన్షన్ అర్థమవుతుంది అని ఓ సందర్భంలో వర్మ చెప్పినప్పుట్టుగానే ఆయన ప్రతీ ట్వీట్లో సాలీడ్ మ్యాటరే ఉంటుంది. ఇక మెగా ఫ్యామిలీని వర్మ కొన్నిసార్లు కార్నర్ చేస్తుంటాడని అందరికీ తెలిసిందే. చిన్న పాయింట్ దొరికితే చాలు.. ఆడేసుకుంటుంటాడు. ఏ పాయింట్ దొరకకపోయినా వర్మకు సినిమాలు చాలు.
ఇప్పుడు అలా సినిమాలను పొగుడుతూనే మెగా హీరోలపై తాజాగా ట్వీట్స్ చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. అంతేకాదు వర్మ చేసిన ఈ ట్వీట్స్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. పుష్ప ట్రైలర్ రిలీజైనప్పటి నుంచి వర్మ ఆ సినిమా మీద ఏదో ఒక సందర్భంలో స్పందిస్తూనే ఉన్నాడు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పుష్ప సినిమాను..ఇందులో పుష్ప రాజ్ పాత్రలో నటించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను పొగుడుతూనే ఉన్నారు. ఆయన తప్ప ఇలాంటి పాత్ర మరే హీరో చేయలేడని వర్మ పుష్ప సినిమా విషయంలో అల్లు అర్జున్ మీద ప్రశంసల వర్షం కురిపించాడు. మరీసారి ఇదే సినిమాతో పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటిల భీమ్లా నాయక్ సినిమాను కంపేర్ చేశాడు.
Pawan kalyan – RGV: పవన్ కళ్యాణ్ … ఒక్క తెలుగు సినిమానే పట్టుకుంటే ఎలా
పుష్ప లాంటి సినిమానే ఇన్ని వందల కోట్లు కలెక్ట్ చేస్తే పవన్ కళ్యణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా ఇంకా ఎంత కలెక్ట్ చేయాలి అని ట్వీట్లో రాసుకొచ్చారు. పవన్ కంటే ముందు తర్వాత వచ్చిన ఎన్.టి.ఆర్, రాం చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియన్ స్టార్స్ అయిపోయారు. పుష్ప సినిమాతోనూ అల్లు అర్జున్ పాన్ ఇండియన్ స్టార్ అయ్యాడు. మరి పవన్ కళ్యాణ్ ఎప్పుడు ..ఇంకా ఆయన ఒక్క తెలుగు సినిమానే పట్టుకుంటే ఎలా భీమ్లా నాయక్ సినిమాను పాన్ ఇండియన్ సినిమాలా రిలీజ్ చేయండి..ఇది పాన్ వరల్డ్ సబ్జెక్ట్ కాదా అంటూ చక చక వర్మ కాఫీ టైంలో ట్వీట్స్ చేసి ఒక్కసారిగా న్యూస్‌ను వైరల్ అయ్యేలా చేశాడు. భీమ్లా నాయక్ సినిమా మలయాళ సినిమాకు రీమేక్. ఆ ఒక్క భాషలో వదిలేది మిగతా మూడు భాషలలో వర్మ చెప్పినట్టు డబ్బింగ్ వర్షన్ అయినా రిలీజ్ చేసేయొచ్చు. మరి మేకర్స్ ఏం ప్లాన్ చేస్తారో చూడాలి.
ఇంటీరియర్ ఆంధ్ర లో జరిగిన పుష్ప సబ్జెక్ట్ పాన్ ఇండియా సబ్జెక్ట్ అయినప్పుడు, కొమరం భీమ్, అల్లూరి లాంటి తెలుగు వీరుల సబ్జెక్ట్ పాన్ ఇండియా అయినప్పుడు, భీమ్లా నాయక్ సబ్జెక్ట్ పాన్ వరల్డ్ సబ్జెక్ట్ కాదంటారా @pawanKalyan గారూ???
— Ram Gopal Varma (@RGVzoomin) January 31, 2022
ఎప్పుడో మీ తర్వాత వచ్చిన పిల్లలు @tarak9999 , @AlwaysRamCharan కూడా పాన్ ఇండియా స్టార్స్ అయిపోతూ ఉంటే, మీరు ఇంకా ఒట్టి తెలుగు ని పట్టుకుని వేలాడటం మీ ఫ్యాన్స్ అయిన మాకు కన్నీటి ప్రాయంగా ఉంది.దయచేసి భీమ్లా నాయక్ ని పాన్ ఇండియా తీసుకెళ్ళి మీరే సబ్కా బాప్ అని ప్రూవ్ చెయ్యండి
— Ram Gopal Varma (@RGVzoomin) January 31, 2022
… @allu_arjun గురించి నా ట్వీట్స్ అన్నీ నా వోడ్కా టైం లో పెట్టాను కానీ నేను ఇప్పుడు పెట్టిన ఈ ట్వీట్స్ నా కాఫీ టైం లో పెడుతున్నా. దీన్ని బట్టి నా సీరియస్ నెస్ ని అర్థం చేసుకోండి @PawanKalyan
— Ram Gopal Varma (@RGVzoomin) January 31, 2022
పుష్ప యే అంత చేస్తే పవర్ స్టార్ @PawanKalyan అయిన మీరు నటించిన భీమ్లా నాయక్ ఇంకా ఎంత కలెక్ట్ చెయ్యాలి? ..పాన్ ఇండియా సినిమా లాగా రిలీజ్ చెయ్యకపోతే మీ ఫ్యాన్స్ అయిన మేమంతా బన్నీ ఫ్యాన్స్ కి ఆన్సర్ చెయ్యలేము
— Ram Gopal Varma (@RGVzoomin) January 31, 2022
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!