NTR 30: యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాపులారిటీని ఒక్కసారి అమాంతం పెంచేసింది “RRR”. ఈ సినిమాలో భీమ్ పాత్రలో తారక్ అందరిని ఆకట్టుకున్నాడు. పాన్ ఇండియా నేపథ్యంలో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా సూపర్ డూపర్ హిట్ అయింది. తారక్ పాత్రకి హాలీవుడ్ మరి ఇతర దేశాలకు చెందిన సినీ ప్రేమికులు ఎంతగానో కనెక్ట్ అయ్యారు. మన దేశంలో నార్త్ ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేయడం జరిగింది. దీంతో “RRR” తర్వాత ఎన్టీఆర్ చేయాల్సిన కొరటాల ప్రాజెక్టు తీరుదిన్నెలు మొత్తం మారిపోయాయి అంట.
మేటర్ లోకి వెళ్తే “RRR” తో ఎన్టీఆర్ కి మంచి మార్కెట్ పాన్ ఇండియా స్థాయిలో ఏర్పడింది. దీంతో కొరటాల తన స్క్రిప్టులో బాలీవుడ్ నటీనటులను తీసుకునే రీతిలో… చాలా మార్పులు చేర్పులు చేయడం జరిగిందంట. ఈ సినిమా కూడా పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ప్రాజెక్టు కావడంతో…. ముందుగానే జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం. నార్త్ ఆడియన్స్ కి కూడా కనెక్ట్ అయ్యేలా కొరటాల స్క్రిప్ట్ వర్క్ చేయడం జరిగిందని ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్ కెరియర్ లో ఇది 30వ సినిమా కావటంతో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఎన్టీఆర్ తన కెరియర్లో రాజమౌళి తో చేసిన తర్వాత… చేసిన సినిమాలు చాలావరకు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. అయితే కొరటాలతో చేయబోయేది 30వ సినిమా కావటంతో చాలా జాగ్రత్తగా ఈ ప్రాజెక్టు విషయంలో ఏటువంటి పొరపాటులు జరగకుండా ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు సమాచారం. మొన్నటి వరకు తారక్ “RRR” జపాన్ ప్రమోషన్ లలో బిజీగా గడపడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ఫ్యామిలీతో కలిసి న్యూయార్కులో ఎంజాయ్ చేస్తున్నారు. ఇండియా వచ్చిన వెంటనే కొరటాల ప్రాజెక్టు ఎన్టీఆర్ స్టార్ట్ చేయనున్నట్లు సమాచారం.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!