RRR: దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం `ఆర్ఆర్ఆర్`. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా.. ఆలియా భట్, ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు.ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ చిత్రం అనేక వాయిదాల అనంతరం మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.
కొమరం భీమ్‌గా తారక్, అల్లూరి సీతారామరాజుగా చరణ్‌లు తమదైన నటనతో విశేషంగా ఆకట్టుకున్నారు. టాక్ బాగుండటం వల్ల ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబడుతూ బ్రేక్ ఈవెన్ దిశగా దూసుకుపోతోంది. మొదటి ఐదు రోజులు రికార్డు స్థాయి కలెక్షన్లను రాబట్టిన ఈ చిత్రం ఆరో రోజు సైతం రూ. 23 కోట్లకు పైగానే కలెక్షన్స్ సాధించి అదరగొట్టింది. ఇక ఏరియాల వారీగా ఆర్ఆర్ఆర్ 6 డేస్ టోటల్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…
నైజాం- రూ. 73.15 కోట్లు
సీడెడ్- రూ. 36.03 కోట్లు
ఉత్తరాంధ్ర- రూ. 20.27 కోట్లు
తూర్పు గోదావరి- రూ. 10.85 కోట్లు
పశ్చిమ గోదావరి- రూ. 9.50 కోట్లు
గుంటూరు- రూ. 13.73 కోట్లు
కృష్ణ- రూ. 10.45 కోట్లు
నెల్లూరు- రూ. 6.19 కోట్లు
————————————–
ఏపీ+తెలంగాణ మొత్తం- రూ.180.17 కోట్లు (రూ.267.70 కోట్లు~ గ్రాస్)
————————————–
కర్ణాటక- రూ. 26.15 కోట్లు
తమిళనాడు- రూ. 23.55 కోట్లు
కేరళ- రూ. 5.35 కోట్లు
హిందీ- రూ. 60.10 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా- రూ. 4.85 కోట్లు
ఓవర్సీస్- రూ. 71.20 కోట్లు
———————————–
వరల్డ్ వైడ్ టోటల్ కలెక్షన్= రూ.371.37 కోట్లు (గ్రాస్- రూ. 670 కోట్లు)
———————————–
కాగా, విడుదలకు ముందుకు ప్రపంచవ్యాప్తంగా రూ. 451 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం.. రూ. 453 కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగింది. దీంతో ఇప్పుడీ సినిమా క్లీన్ హిట్ అవ్వాలంటే మొదటి ఆరు రోజులు వచ్చిన కలెక్షన్లు కాకుండా.. ఇంకా రూ. 81.63 కోట్ల షేర్ వసూల్ చేస్తే సరిపోతుంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!