Shivathmika: సినీ నటులు రాజశేఖర్ – జీవిత దంపతుల ముద్దుల కుమార్తె శివాత్మిక రాజశేఖర్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా కేవీఆర్ మహేంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన `దొరసాని` సినిమాతో శివాత్మిక తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.
ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డా.. శివాత్మిక నటకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. ఈ మూవీ అనంతరం శివాత్మిక పంచతంత్రం, రంగమార్తండ చిత్రాల్లో నటించింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాలు త్వరలోనే విడుదల కానున్నాయి. మరోవైపు `ఆనందం విలైయాడుం వీడు` అనే మూవీతో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చిన శివాత్మిక.. ఇప్పుడు అక్కడ సైతం అవకాశాలు అందుకుంటోంది.
ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ వెకేషన్ కోసం దుబాయ్ వెళ్లింది. అక్కడ శివాత్మిక చిట్టి పొట్టి బట్టలు ధరించి తన అందాలతో దడదడలాడిస్తోంది. అందాల ఆరబోతలో ఎలాంటి నిబంధనలు పెట్టుకోకుండా చూపించాల్సినవన్నీ చూపిస్తూ కుర్రాళ్ళకు చెమటలు పట్టిస్తోంది.
శివాత్మిక లేటెస్ట్ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి, వీటిని చూసిన నెటిజన్లు.. సూపర్, సో హాట్, సమ్మర్లో శివాత్మిక ఇంకాస్త హీట్ పెంచుతోంది అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం శివాత్మిక తాజా ఫొటోలపై మీరు ఓ లుక్కేసేయండి.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!