NewsOrbit
Featured బిగ్ స్టోరీ సినిమా

RRR Movie Review: విజువల్ వండర్ర్ర్ర్.. కానీ ఓ సహన పరీక్ష..!

RRR Movie Review: Visual Wonder But... Some

RRR Movie Review: సినిమాలు తీయడం ఒక కళ.. ఆ కళలో కసి.., తపన.., ప్రణాళిక ఉంటేనే అది విజయవంతమవుతుంది..! ఒక సినిమా తీయడం అనేది 200 రోజుల ప్రాసెస్ అనుకుంటే.. మొదటి రోజు నుండి 200 వ రోజు వరకు అదే డెడికేషన్ తో చేయాలి.., చివరికి స్క్రీన్ లో ప్రేక్షకుడికి చూపించే వరకు మొదట అనుకున్నది అనుకున్నట్టు ప్రెజెంట్ చేయగలగాలి.. చాలా మంది దర్శకులు అక్కడే ఫెయిల్ అవుతున్నారు.. కానీ రాజమౌళి మాత్రం అక్కడే సక్సెస్ అవుతున్నారు.. తన తండ్రి రాసిచ్చిన స్క్రిప్ట్ కి కొన్ని సన్నివేశాలు జోడించి.. ప్రేక్షకుడిని కట్టిపడేసేలా తీయడమే ఆయన ప్రత్యేకత. అందుకే స్టూడెంట్ నంబర్ వన్ మొదలుకుని బాహుబలి 2 వరకు అన్నీ హిట్లే..!! ఇక ఆర్ఆర్ఆర్ (RRR) తీశారు. దాదాపు మూడేళ్లకు పైగా ఈ సినిమా ప్రయాణం కొనసాగింది. ఇద్దరు పెద్ద హీరోలతో భారీ బడ్జెట్ తో తీశారు. ఈ సినిమా ఎలా ఉంది..!? రాజమౌళి తన మార్క్ చూపించారా..!? ఎన్టీఆర్, చరణ్ ఎలా చేశారు..!? అనేది కాస్త లోతుగా చూద్దాం..!

RRR Movie Review: Visual Wonder But... Some
RRR Movie Review Visual Wonder But Some

RRR Movie Review:  కథ సింపుల్.. కానీ..!

ఈ సినిమాలో కథ చాలా చిన్నది. ఒక విధంగా కథ లేనట్టే ఉంటుంది. అనగనగా స్వాతంత్రానికి ముందు.. ఓ అడవిలో గిరిజనులను రక్షించుకుంటూ ఓ రక్షకుడు ఉంటాడు.. అతని పేరే భీమ్ (ఎన్టీఆర్).. ఆ అడవిలో ఓ బాలికని బ్రిటీష్ వాళ్ళు తమ కోటకు ఎత్తుకెళ్ళిపోయి.. బానిసగా పని చేయించుకుంటారు.. ఆ బాలికను తీసుకొచ్చి తల్లికి అప్పగించడమే ఈ సినిమాలో భీమ్ పాత్ర..! * బ్రిటీష్ వాళ్ళ దగ్గర పోలీసు అధికారిగా పని చేస్తున్న రామరాజు(రామ్ చరణ్) కి ఒక కథ ఉంటుంది. అతను కూడా ఒక లక్ష్యం కోసమే పని చేస్తుంటాడు. ఆ భీమ్ ఈ బ్రిటీష్ కోతకు వచ్చి ఆ బాలికను తిరిగి తీసుకెళ్లే తతంగంలో “భీమ్ – రామ్”ల మధ్య చిగురించిన స్నేహం, ద్వేషం, ఎమోషన్ అన్నీ కలిపి మిగిలిన కథ.. కథలో భాగాలు.. కథలో సన్నివేశాలు..! హీరోలిద్దరూ ఎవరి లక్ష్యాలను వాళ్ళు అందుకున్నారా.. లేదా..!? అనేది చివర్లో తేలుతుంది. అయితే కథ ఇంత చిన్నగా ఉన్నప్పటికీ రాజమౌళి కదా.. కథలో పాత్రలు మాత్రం చాలా బలంగా ఉన్నాయి. భావోద్వేగాలతో కూడిన సన్నివేశాలు అక్కడక్కడా కట్టిపడేసేలా ఉండడంతో కథ పెద్దగా లేదన్న లోపం కనిపించదు..!

RRR Movie Review: ఎలా ఉంది..? ఎలా చేసారు..!? విశ్లేషణ!

ఈ చిన్న కథలో పెద్ద పెద్ద పాత్రలు ఉండడంతో రాజమౌలి తనకే సాధ్యమైన సన్నివేశాలు ఆవిష్కరించారు. హీరోల ఎంట్రీ భిన్నంగా ప్లాన్ చేసారు, దానికి తగ్గట్టు చూపించారు. వారి కలయిక.. అక్కడ నీటిలో బాలుడిని రక్షించే సీన్ నుండి ఇంటర్వెల్ ముందు సీన్ వరకు ఎక్కడా కుర్చీ నుండి కదిలే అవకాశం కూడా ప్రేక్షకుడికి ఉండదు. అంత ఆసక్తిగా మలిచారు. ఒకరినొకరు పోటీగా నటించారు. ఇంటర్వెల్ ముందు వచ్చే భారీ యాక్షన్, ఎమోషనల్ సీన్ తో మొదటి భాగం బాగుంది అనిపిస్తూ ఆ మంచి ఫీల్ తో.. రెండో భాగం మొదలవుతుంది.. రెండో భాగమే రాజమౌళి కాస్త తడబడినట్టు స్పష్టంగా కనిపించింది. రామ్ చరణ్ పాత్రకి బలమైన ఫ్లాష్ బ్యాక్ చూపించే ప్రయత్నం చేసారు. అది బాగానే ఉన్నప్పటికీ అంతగా కనెక్ట్ కాదు.. దీనిలో అజయ్ దేవగన్ పాత్ర బాగుంది. బాగా చేసారు..! ప్రీ క్లైమాక్స్ కి వచ్చేసరికి రెండోభాగంలో దాదాపు అరగంట సినిమా ప్రేక్షకుడిని అసహనానికి గురి చేస్తుంది. అనవసర సన్నివేశాలు.. అతి సన్నివేశాలు పెట్టారు అనిపిస్తుంది. ఇదే సమయంలో వచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకోదు.. సో.. ఇంటర్వెల్ తర్వాత రెండోభాగంలో సహన పరీక్ష తప్పదు. ఓ దశలో చిన్నపిల్లలా బొమ్మల సినిమా చూస్తున్నామా అనే ఫీలింగ్ కూడా కలుగుతుంది.. ఆ అసహనం నుండి తేరుకునేందుకు.. ఎన్టీఆర్ ని చరణ్ తప్పించడం.. ఎన్టీఆర్ చరణ్ గతం తెలుసుకుని.. అతని కోసం వెళ్లడం కాస్త ఉపశమనాన్ని ఇస్తాయి. ఇక క్లైమాక్స్ కి మళ్ళీ రాజమౌళి తరహా స్క్రీన్ ప్లే, సీన్లు కనిపిస్తాయి.

RRR Movie Review: Visual Wonder But... Some
RRR Movie Review Visual Wonder But Some

చరణ్ ప్రాణం పెట్టాడు..!!

సాధారణంగా ఎన్టీఆర్ పక్కన రామ్ చరణ్ నటించడం అంటే చరణ్ తేలిపోతాడు అనిపిస్తుంది. ఎన్టీఆర్ పలికించే హవభావాలు, డైలాగులు ప్రేక్షకుడికి బాగా కనెక్ట్ అవుతాయి.. కానీ ఈ సినిమాలో మొదటి నుండి ఎన్టీఆర్ కంటే చరణ్ పాత్ర చిత్రీకరణ బలంగా ఉంది. చరణ్ పాత్రని నూటికి నూరుశాతం రూపొందిస్తే.. ఎన్టీఆర్ పాత్రని మాత్రం నూటికి 60 శాతానికే పరిమితం చేసారు అనిపిస్తుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే “స్నేహితుణ్ణి శిక్షిస్తూ రక్షించాల్సిన.. రక్షిస్తూ శిక్షించాల్సిన సందర్భంలో” ఈ భిన్నమైన భావోద్వాగాన్ని చరణ్ బాగానే చూపించాడు. ఇద్దరూ వారి పాత్రల్లో పూర్తిగా జీవించారు. ఇక మిగిలిన నటులు అలియా భట్, ఒలీవియా మొరెస్, అజయ్ దేవగన్, శ్రీయ, రాహుల్ రామకృష్ణ కూడా చక్కగా నటించారు.

ఓవరాల్ గా “న్యూస్ ఆర్బిట్ రేటింగ్” 3.5/5
ఒక్క మాటలో “రాజమౌళి మరో విజువల్ వండర్ (ఆ అరగంట తప్ప)..!

author avatar
Srinivas Manem

Related posts

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N