ప్రముఖ నటి సాయి పల్లవి ఫిదా సినిమా ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయింది. ప్రస్తుతం ఆమెకి హీరోలకు ఉన్నంత క్రేజ్ ఉంది. ఎటువంటి మేకప్ వేసుకోకుండా సినిమాల్లో హీరోయిన్గా నటిస్తూ అటు యూత్ లో ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి పేరు సంపాదించింది. ఇటీవల జరిగిన ఓ ఆడియో ఫంక్షన్ లో సాయి పల్లవికి ఉన్న క్రేజ్ చూసి సుకుమార్ సాయి పల్లకి ‘లేడీస్ పవర్ స్టార్’ అని ట్యాగ్ కూడా ఇచ్చారు.
గార్గి మూవీ
ఇదిలా ఉండగా ప్రస్తుతం సాయి పల్లవి వరుస సినిమాలో బిజీ అయిపోయింది. ఇటీవలే ఆమె నటించిన గార్గి సినిమా విడుదలై ఘనవిజయం సాధించింది. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదల అయిన గార్గి సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు వసూలు చేసింది. ఈ సినిమాలో సాయి పల్లవి తన సహజ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ‘గార్గి’ సినిమా ఓటీటీలో వీడియోలకు సిద్ధంగా ఉంది.
స్ట్రీమ్ అయ్యేది ఆరోజే
ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివిల్ ఆగస్ట్ 12న గార్గి సినిమాను తెలుగు, తమిళ, కనడ భాషలో స్ట్రీమ్ కానుంది. గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వం వహించిన గార్గి సినిమా విడుదల అయ్యి థియేటర్ లలో నాలుగు వారాలు అవుతుండగా ఇప్పుడు డిజిటల్ మీడియాలో రిలీజ్కు సిద్ధమైంది. నిజానికి ఈ మధ్య కాలంలో చాలా వరకూ సినిమా లు అంతంత మాత్రం ఆడుతున్నాయి. ఈ క్రమం లో సాయి పల్లవి నట్టించిన గార్గి సినిమా కేవలం వారం లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది.గార్గి సినిమాలు ఎస్పీ ప్రొడక్షన్ బ్యానర్ పై రానా విడుదల చేసారు.ప్రస్తుతం సాయి పల్లవి కోలీవుడ్ లోన్ని శివకార్తికేయ సరసన హీరోయిన్ గా ఓ సినిమా లో నటించబోతుంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!