Samantha: సమంత రూత్ ప్రభు ప్రస్తుతం తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌ను చాలా జాగ్రత్తగా పక్కాగా ప్లాన్ చేసుకుంటోంది. ఈ మధ్య సమంత వరుసగా కథలు వింటూ నచ్చిన కథలకు వెంటనే సైన్ చేసేస్తోంది. ఇప్పటికే సమంత తెలుగు, తమిళంలో తెరకెక్కనున్న రెండు సినిమాలకు ఒకే చెప్పిన సంగతి తెలిసిందే. వీటిలో యశోద సినిమా షూటింగ్ కూడా చాలా వరకు పూర్తి చేసింది. మరో ద్విభాషా సినిమాను పట్టాలెక్కించాల్సి ఉంది. ఈ క్రమంలోనే తాజాగా సమంత మరో బాలీవుడ్ ప్రాజెక్ట్ కు సైన్ చేసిందట.
బాలీవుడ్ సూపర్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ గత 5 ఏళ్ళుగా క్రేజీ సినిమాలను చేస్తూ కంటిన్యూగా హిట్స్ అందుకుంటున్నారు. ఇప్పుడు ఆయన సరసనే సామ్ ఛాన్స్ అందుకుందని తెలుస్తోంది. ఈ భారీ చిత్రానికి కుమార్ మంగత్ దర్శకత్వం వహిస్తారని సమాచారం. ఇక ఇందులో నటించే ఇతర నటీనటులు సాంకేతిక సిబ్బందికి సంబంధిం చిన విషయాలను త్వరలోనే మేకర్స్ అధికారిక ప్రకటించబోతున్నారు. గత ఏడాది ప్రముఖ ఓటీటీ అమెజాన్ బ్లాక్ బస్టర్ సిరీస్ అయిన ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 లో నటిన్చిన సమంత బాలీవుడ్లో భారీ క్రేజ్ దక్కించుకుంది.
Samantha: ఫ్యామిలీ మాన్ మేకర్స్‌తో ఇప్పటికే ఓ సినిమా..
సౌత్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్గా సమంత పాపులర్ అయింది. ఈ క్రమంలో ఆమెకు పలు బాలీవుడ్ మూవీస్ లో అవకాశాలు వస్తున్నాయట. ఇక అక్కడ సొంత ఇల్లు కొనుక్కోవాలని కూడా సమంత దీనికే అని చెప్పుకుంటున్నారు. అరడజను హిందీ సినిమాలను సమంత లైన్లో పెట్టబోతుందని సమాచారం. ఫ్యామిలీ మాన్ మేకర్స్‌తో ఇప్పటికే ఓ సినిమాకు సైన్ చేయగా, తాప్సీ నిర్మాతగానూ సమంత ఒక సినిమాను చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా అక్షయ్ కుమార్ సినిమాను ఓకే చేసిందట. ఇక తెలుగులో శాకుంతలం, తమిళ మల్టీస్టారర్ కథు వాకుల రెండు కాదల్ రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!