SVP: సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన “సర్కారు వారి పాట” సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ రెండో వారం అదిరిపోయే కలెక్షన్లతో దూసుకుపోతుంది. పరీక్షలు పూర్తి కావడంతో సర్కారు వారి పాట థియేటర్ ల వద్ద హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. పరశురామ్ దర్శకత్వంలో మహేష్ ఫస్టాఫ్ లో హీరోయిన్ కీర్తిసురేష్ తో చేసిన కామెడీ ట్రాక్… సెకండాఫ్ స్టొరీ తో.. చూసిన ఆడియన్స్.. సంతృప్తి చెందడం జరిగింది. ప్రారంభంలో సినిమాకు నెగిటివ్ టాక్ కొంతమంది తీసుకురావాలని ప్రయత్నించినా గాని.. సినిమా కలెక్షన్లను ఏవీ కూడా ఆపలేకపోయాయి.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఈ పరిణామంతో “సర్కారు వారి పాట” మరోసారి మహేష్ బాబు స్టామినా ఏంటో ప్రూవ్ చేసినట్లయింది. ఇదంతా పక్కన పెడితే తాజాగా మహేష్ ఈ సినిమాతో మరో రికార్డ్ బ్రేక్ చేయడం జరిగింది. అది కూడా తన సినిమా రికార్డే. మేటర్ లోకి వెళ్తే అనిల్ రావిపూడి దర్శకత్వం లో 2020లో సంక్రాంతి పండుగ కానుకగా వచ్చిన “సరిలేరు నీకెవ్వరు” సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కూడా మహేష్ తన అదిరిపోయే కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించాడు. అయితే ఈ సినిమా యూఎస్ కలెక్షన్లను తాజాగా ఆదివారం నాటికి “సర్కారు వారి పాట” క్రాస్ చేయడం జరిగింది.
“సర్కారు వారి పాట” యూఎస్ లో $26,573…155 లొకేషన్ లలో డాలర్లు రాబట్టింది. దీంతో ఇంకా రెండున్నర మిలియన్లు కలెక్షన్ సాధిస్తే సేఫ్ జోన్ లో “సర్కారు వారి పాట” ఉండనుంది. ఇండస్ట్రీలో మొదటి నుండి ఓవర్సీస్ లో భారీ మార్కెట్ అన్న హీరోగా మహేష్ కి పేరుంది. దీంతో “సర్కారు వారి పాట” సినిమా కి ఓవర్సీస్ మార్కెట్ లో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడం జరిగిందని ట్రేడ్ వర్గాల రిపోర్ట్.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!