ఇమేజ్‌తో సంబంధం లేకుండా సినిమాల్లో భాగం అవడానికి ప్రయత్నించే వారిలో శింబు ఒకడు. రీసెంట్గా 90 ఎం.ఎల్ చిత్రంలో గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వడమే కాకుండా.. ఆ సినిమాకు సంగీతం కూడా అందించాడుశింబు. ఇప్పుడు తన స్నేహితుడు ఆర్య కోసం శింబు నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రధారిగా నటించబోతున్నాడు. వివరాల్లోకెళ్తే.. కన్నడంలో శివరాజ్‌కుమార్, శ్రీమురళి నటించిన మఫ్టీ సినిమా చాలా పెద్ద సక్సెస్ సాధించింది. దీన్ని తమిళంలో రీమేక్ చేస్తున్నారు. అందులో ఆర్య హీరోగా నటిస్తుండగా ఇప్పుడు శింబు కూడా యూనిట్‌తో జాయిన్ అవుతున్నాడు. స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై కె.ఇ.జ్ఞానవేల్‌రాజా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక సమాచారం రానుంది.
previous post
next post
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!