మెగాస్టార్ చిరంజీవికి మాస్ హీరోగా తిరుగులేని క్రేజ్ ఉంది. అయితే ఆయనకు తొలి అడుగుగా ఉపయోగపడిన చిత్రం `ఖైదీ`. 1983లో విడుదలైన ఈ చిత్రంతో ఆయన స్టార్ హీరో రేంజ్‌కు చేరుకున్నాడు. తర్వాత చిరంజీవికి ఖైదీ అనే టైటిల్ సెంటిమెంట్‌గా మారింది. ఆయన నటించిన ఖైదీ నెంబర్ 786 కూడా ఘన విజయాన్ని సాధించింది. ఇక ఆయన రీ ఎంట్రీ చిత్రం కూడా ఖైదీ నెంబర్ 150గానే ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు అలాంటి సెంటిమెంట్ టైటిల్‌ను మరో హీరో పెట్టుకున్నాడు. ఆ హీరో ఎవరో కాదు.. కార్తి. తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుపరిచితుడైన కార్తి ఖైదిగా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. నగరం అనే సందీప్ కిషన్ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయిన లోకేష్ కనకరాజ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు కార్తి ఖైది ఫస్ట్ లుక్ చూస్తుంటే ఇన్టెన్స్గా కనపడుతుంది.
previous post
next post
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!