ఎన్టీఆర్-ఏఎన్నార్ హయాంలో వారి పిల్లలు బయటి ప్రపంచానికి దాదాపు తెలీదు. చిరంజీవి హయాం వచ్చిన తర్వాత సినీ పత్రికల్లో అరుదుగా వారి పిల్లలు కనిపించేవారు. ఈమాత్రం దానికే ఫ్యాన్స్ సంబరాలు చేసుకునే వారు. కానీ.. ఇప్పుడు కాలం మారింది. టెక్నాలజీ పూర్తిగా అందుబాటులోకి వచ్చింది. డిజిటల్ యుగం నడుస్తున్న ప్రస్తుత తరుణంలో స్టార్ కిడ్స్ కనిపించకపోతే తప్పు. ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్.. ఇలా సోషల్ మీడియా మాధ్యమాల్లో వాళ్లు చేసే సందడే వేరు. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోల కిడ్స్ సంబరాలకు క్రిస్మస్ వేదిక అయింది. శాంటక్లాజ్ గెటప్స్, క్రిస్మస్ ట్రీ అలంకరణ, ఫ్యామిలీతో సెలబ్రేషన్స్ తో హడావిడి చేశారు.

సోషల్ మీడియాలో నిత్యం సందడి చేసే టాలీవుడ్ సెలబ్రిటీల్లో అల్లు అర్జున్, మహేశ్, ఎన్టీఆర్ కిడ్స్ ముందు ఉంటారు. చిరంజీవి ఫ్యామిలీ నుంచి ఆయన కుమార్తెల పిల్లలు కూడా సందడి చేస్తూ ఉంటారు. ప్రస్తుతం క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకుంటూ బన్నీ కిడ్స్.. అయాన్, అర్హ క్రిస్మస్ సంబరాలు చేసుకున్నారు. డ్రెస్సింగ్, క్రిస్మస్ ట్రీ డెకరేషన్ లో స్పెషలైజేషన్ చూపించారు. మహేశ్ పిల్లలు గౌతమ్, సితార కూడా క్రిస్మస్ ట్రీ దగ్గర సందడి చేశారు. వారిద్దరూ స్పెషల్ గా కనిపించారు. ఎన్టీఆర్ పిల్లలు కూడా ఇదే సంబరాలు చేసుకున్నారు. చిరంజీవి కుమార్తె శ్రీజ తనయ బర్త్ డే, క్రిస్మస్ సెలబ్రేషన్స్ కలిపి నిర్వహించారు. మంచు లక్ష్మీ కూడా తన చిన్నారితో క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు.
ఇలా ప్రత్యేక సందర్భాల్లోనే కాకుండా.. వీరంతా క్యాజువల్ గా కూడా నెట్టింట్లో సందడి చేస్తూంటారు. కరోనా టైమ్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా చెప్పారు. చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత తనయ సంహిత కూడా ఇటివల రుద్రమదేవి సినిమాలోని డైలాగ్ ను నటిస్తూ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. ఇలా వీరంతా స్టార్ కిడ్స్ గానే కాకుండా తమలోని టాలెంట్ ను సోషల్ మీడియా వేదికగా ప్రదర్శించి ఫ్యాన్స్ ను ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నారు.