బంపర్ ఆఫర్ కొట్టేసిన సుకుమార్.. బాలీవుడ్ స్టార్ హీరోని లైన్ లో పెట్టేసాడు..??

Share

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న సుకుమార్ “పుష్ప” విజయంతో పాన్ ఇండియా స్థాయిలో మంచి క్రేజ్ సంపాదించాడు. గత ఏడాది విడుదలైన “పుష్ప” భారీ విజయం సాధించడం తెలిసిందే. ఈ సినిమాలో అల్లు అర్జున్ మేనరిజం మరియు డైలాగులు ఇంకా… పాటలకు వేసిన స్టెప్పులు ప్రపంచవ్యాప్తంగా చాలామందిని ఆకట్టుకోవడం జరిగింది. ఫస్ట్ టైం పాన్ ఇండియా సినిమా చేసిన సుకుమార్… తిరుగులేని విజయాన్ని సాధించడం జరిగింది. ప్రపంచంలో చాలామంది సెలబ్రిటీలు ఇంకా వివిధ క్రీడా రంగానికి చెందిన వాళ్లు పుష్ప మేనరిజం వీడియోలు సోషల్ మీడియాలో చేసి వైరల్ అయ్యారు.

పుష్ప 2 కోసం బన్నీ, సుకుమార్ అలా ప్లాన్ చేస్తున్నారా?

“పుష్ప” తో దర్శకుడు సుకుమార్ కి మంచి పేరు వచ్చింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో మిస్టర్ పర్ఫెక్ట్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తో డైరెక్టర్ సుకుమార్ సినిమా ఛాన్స్ అందుకున్నట్టు లేటెస్ట్ టాక్ నడుస్తోంది. ఇటీవల సుకుమార్… అమీర్ ఖాన్ కి స్టోరీ వినిపించారట. ఆయన కూడా సినిమా చేయడానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. అందువల్ల ఇటీవల “లాల్ సింగ్ చాద్దా” సినిమా ప్రీమియర్ షో చిరంజీవి ఇంటిలో వేయగా.. అమీర్ ఖాన్ తో పాటు సుకుమార్ తిలకించడం జరిగిందంట.

ప్రస్తుతం సుకుమార్ ఐకాన్ స్టార్ బన్నీతో “పుష్ప” సెకండ్ పార్ట్ చేస్తున్నారు. బన్నీతో తర్వాత విజయ్ దేవరకొండ ఆ తర్వాత రామ్ చరణ్ సినిమాలు ఉన్నారట. వీళ్ళ అందరితో అయినా వెంటనే బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తో సుకుమార్ సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలు.. దక్షిణాదికి చెందిన దర్శకులతో పని చేస్తూ ఉన్నారు. బాలీవుడ్ కింగ్ కాంగ్ షారుక్ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో “జవాన్” చేస్తున్నారు. ఇంకా “అర్జున్ రెడ్డి” ఫిలిం డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో యానిమల్ అనే సినిమాలో రణబీర్ కపూర్ చేస్తున్నారు. కాక ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో అమీర్ నటించడానికి రెడీ అయినట్లు సమాచారం.


Share

Recent Posts

స్వప్న బ్లాక్పె మెయిల్…పెళ్లి కొడుకుగా నిరూపమ్…!

స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…

2 hours ago

మొహర్రం సందర్భంగా ప్రత్యేక సందేశం విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్

మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…

3 hours ago

Devatha 9August 620: దేవి నీలాగే ఉందని ఆదిత్యను నిలదీసిన దేవుడమ్మ.. మాధవ్ మాయలో పడ్డ సత్య..

దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…

3 hours ago

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…

4 hours ago

నేడు జేడీ(యూ) ఎమ్మెల్యేలు, ఎంపీలతో బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక భేటీ .. బీజేపీతో కటీఫ్‌కి సిద్దమయినట్లే(గా)..?

బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…

4 hours ago

నేటి నుండి ఏపిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన

ఏపిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గోదావరి వరదల వల్ల వందలాది గ్రామాలు , వేలాది ఎకరాల పంట ముంపునకు గురైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పెద్ద…

5 hours ago