ప్రపంచాన్ని కరోనా కమ్మేసిన 2020లో ఎన్నో సినిమాలు విడుదల వరకూ వచ్చి లాక్ డౌన్ లో చిక్కుకుపోయాయి. దీంతో దాదాపు తొమ్మిది నెలలుగా ధియేటర్లలో కొత్త సినిమాలు లేవు. కానీ.. ఈ టైమ్ లో ప్రేక్షకుల్ని కాస్త్ ఎంటర్ టైన్ చేసింది ఓటీటీ ప్లాట్ ఫామ్. దీన్నే ఆసరాగా చేసుకుని చాలా కొత్త సినిమాలు ఓటీటీల్లో రిలీజ్ అయ్యాయి. కొన్ని ప్రేక్షకాదరణ దక్కించుకున్నాయి.. మరికొన్ని ఫెయిల్ అయ్యియి. అయితే.. ఇలా విడుదలైన సినిమాల్లో దాదాపు స్టార్ హీరోల సినిమాలు లేవు. కానీ.. ధైర్యం చేసి రిలీజ్ చేసిన ఒక స్టార్ హీరో సినిమా సూపర్ హిట్ కావడమే కాదు.. మరో అరుదైన ఘనతను సాధించింది.
ఆ సినిమానే తమిళ హీరో సూర్య హీరోగా నటించిన ‘సూరారై పొట్రు’. తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ పేరుతో ఈ సినిమా విడుదలైంది. అయితే.. ఓటీటీలోనా, ధియేటర్లోనా అనే సందేహాల మధ్య ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేశారు. అనూహ్యంగా ఈ సినిమా ఓటీటీలోనే బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడీ సినిమా మరో అరుదైన ఘనత సాధించింది. ఏకంగా 2020 మోస్ట్ సెర్చ్ ఆఫ్ ది ఇయర్ లో దేశం మొత్తం మీద రెండో స్థానంలో నిలిచింది. ఓటీటీల్లో అత్యధికంగా వీక్షించిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. కలలను సాకారం చేసుకునేందుకు ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సాధించొచ్చు అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కింది. ఏవియేషన్ లో ఎయిర్ డెక్కన్ ను స్థాపించిన గోపీనాధ్ నిజజీవిత కథతో ఈ సినిమా తెరకెక్కింది.
సుధా కొంగర దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ హిట్ సాధించింది. ఇప్పుడు గూగుల్ సెర్చ్ లో కూడా రెండో స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని గూగుల్ స్వయంగా వెల్లడించింది. ఎమోషనల్ డ్రామాతో తెరకెక్కిన ఈ సినిమా విడుదలై ఇంకా రెండు నెలలు కూడా పూర్తికాక ముందే ఇంతటి రికార్డు క్రియేట్ చేయడం విశేషం. ఈ లిస్టులో మొదటి స్థానంలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆఖరి సినిమా ‘దిల్ బేచారా’ నిలిచింది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!