Upasana: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ భార్య ఉపాసన ప్రస్తుతం ఐదు నెలల గర్భవతి. చరణ్ మరియు ఉపాసనకి పెళ్లి అయ్యి పది సంవత్సరాలు అయింది. ఈ క్రమంలో పిల్లల విషయంలో ఉపాసన ఇంకా చరణ్ చాలా ఇంటర్వ్యూలలో అనేక ప్రశ్నలు ఎదుర్కోవటం జరిగింది. ఈ క్రమంలో ప్రశ్నలకు ఇచ్చిన జవాబులు కొన్నిసార్లు కాంట్రవర్సీగా కూడా మారాయి. ఇలా ఉంటే లేటెస్ట్ గా ఇంటర్వ్యూలో ప్రెగ్నెన్సీ అసలు ఆలస్యం అవడానికి గల కారణాన్ని ఉపాసన తెలియజేసింది. పెళ్లయిన పది సంవత్సరాల వరకు పిల్లలు వద్దనుకున్నట్లు.. ఇది ఇద్దరం తీసుకున్న నిర్ణయం అని స్పష్టం చేసింది.
ఇందువల్లే ప్రెగ్నెన్సీ ఆలస్యమైనట్లు స్పష్టం చేసింది. ఇప్పుడు పుట్టే పిల్లలకు అన్ని సమకూర్చగలిగే స్థాయికి తామోచ్చినట్లు ఉపాసన పేరు పొంది. ఇద్దరం మా రంగాలకు సంబంధించి అద్భుతంగా రాణించాం. సమాజం కుటుంబం బంధుమిత్రుల ఒత్తిడితో కాకుండా నేను తల్లిని కావాలని కోరుకున్నప్పుడే గర్భం దాల్చడం సంతోషం కలిగించింది” అంటూ ఉపాసన వివరించారు. జులై లేదా ఆగస్టు నెలలో ఉపాసన డెలివరీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉపాసన గర్భంతో ఉన్న సమయంలో చరణ్ కెరియర్ పరంగా మంచి సక్సెస్ అందుకుంటూ ఉండటంతో కుటుంబం మొత్తం సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ఎప్పటినుండో ఈ విషయంలో ఎదురుచూస్తూ ఉన్నారు. ఉపాసన ప్రెగ్నెన్సీ విషయాన్నీ కూడా ఫస్ట్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసి తెలియజేయడం జరిగింది.
దీంతో ఇప్పుడు మెగా ఫ్యాన్స్ అంతా రాబోయే బేబీ కోసం ఎంత ఆతృతగా ఉన్నారు. ప్రస్తుతం చరణ్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. “గేమ్ చేంజర్” అనే టైటిల్ తో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఇటీవల చరణ్ పుట్టినరోజు నాడు ఈ సినిమాకి సంబంధించి విడుదలైన పోస్టర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో చరణ్ సినిమా చేయబోతున్నారు. ఈ రెండు ప్రాజెక్టులు అయిన తర్వాత “RRR 2” సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!