Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబుతో స్క్రీన్ షేర్ చేసుకోవాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా కొంత మంది హీరోయిన్లు మహేష్ సరసన ఒక్కసారైనా నటించాలని తెగ తాపత్రాయ పడుతుంటారు. ఇక తాజాగా ఓ టాలీవుడ్ హీరో మహేష్ బాబుకు విలన్‌గా చేయాలనుందంటూ మనసులో ఉన్న మాటను బయట పెట్టేశారు.
ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు.. మహేష్ బాబు బావ మరిది, ప్రముఖ హీరో సుధీర్ బాబు. మంచి టాలెంట్ ఉన్నా సక్సెస్ లేని హీరోల్లో ఈయన ఒకరు. `ఎస్ఎంఎస్` మూవీతో హీరోగా సినీ కెరీర్‌ను స్టార్ట్ చేసిన సుధీర్ బాబు.. `ప్రేమకథా చిత్రమ్`తో సూపర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత వరుస సినిమాలు చేసిన ఈయన.. స్టార్ హీరోగా ఎదగలేకపోయినా నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్నాడు.
ఈయన చివరగా `శ్రీదేవి సోడా సెంటర్` మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గత ఏడాది ఆగష్టులో విడుదలైన ఈ మూవీ మంచి విజయమే సాధించింది. ఇకపోతే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుధీర్ బాబు.. బావ మహేష్‌తో కలిసి సినిమా చేయాలనుంది. ముఖ్యంగా ఆయన సినిమాలో విలన్‌గా చేయడానికి ఆసక్తిగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చాడు.
తన ఇమేజ్‌కి తగ్గ పాత్ర, మహేష్ ఇమేజ్‌కి తగ్గ కథ దొరికితే కలిసి నటించేందుకు తాను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటానని కూడా సుధీర్ బాబు పేర్కొన్నాడు. మరి మహేష్‌కి విలన్‌గా చేయాలని ఆరాటపడుతున్న సుధీర్ బాబుకు.. ఆ అవకాశం వస్తుందో లేదో చూడాలి. కాగా, ప్రస్తుతం ఈయన `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` అనే సినిమా చేస్తున్నాడు. కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!