కాజల్ అగర్వాల్ తన చూపులతో కుర్రకారును అమాంతం తనవైపు తిప్పుకునే హీరోయిన్. భారీ హిట్ లను తన ఖాతలో వేసుకుని తనేంటో నిరుపించుకున్న మిత్రవింద తను. వేరియేషన్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ అనడంలో ఏ మాత్రం సందేహం లేదని పలువురు సినీ ప్రముఖులు చెప్తుంటారు. తెలుగు అమ్మాయిలాగ పాత్రల్లో అమాంతం ఒదిగిపోతుందని నిర్మాతలు చెప్తుంటారు. ఏ పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోయే లక్షణం తనకు ఉందని తన ఫ్యాన్స్ చెప్పే మాట.
అయితే తనకు విమర్శలు కూడా ఎక్కువే.. సినిమాలు రాకపోవడంతో తన పని అయిపోయిందని పలువురు విమర్శకులు అంటుంటారు. అలాంటి సమయంలో భారీ హిట్ కొట్టి తనేంటో నిరుపించుకుంటుంది ఈ పంచదార బొమ్మ. సీనియారిటి లిస్ట్ లోకి ఎక్కిన ఈ భామకు తనకు వస్తున్న సినీ ఆఫర్లతో ఇప్పటికీ బిజీగానే ఉంటుంది. ప్రస్తుతం ఆచార్య, భారతీయుడు సీక్వెల్ సినిమాలే కాకుండా విష్ణు తో మోసగాళ్లు అనే సినిమా చేస్తోంది.
అయితే పోయిన వారంలోనే తన ప్రియుడు గౌతమ్ కిచ్లుతో పెళ్లి అయిన విషయం తెలిసిందే. అయితే పెళ్లి తర్వాత సినిమాలు చేయబోదని పలువురు సినీ విమర్శకులు చేస్తున్న విమర్శలను ఒక్కసారిగా కొట్టేసింది. పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తానని చెప్పేసింది. అలాగే తన ప్రియుడితో ఫొటో షూట్ లో పాల్గొని ఆ ఫొటోలను సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకుంది. అలాగే తన ప్రేమగురించి అందరికీ తెలిసేలా చెప్పుకొచ్చింది.
ఈ పంచదార బొమ్మ ఉన్నట్టుండి ఒక ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ చూసిన వారందరికీ ఈ చేపకళ్ల సుందరి మూవీస్ లో నటించదేమో ఇక తన కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టేస్తుందేమో అనేలా ఉంది. ఇట్స్ నెవర్ టూ లేట్.. ఐ సే నో అంటూ ఈ భామ చేసినా ట్వీట్ చర్చకు దారి తీస్తుంది. కరోనాకు ఈ ముద్దుగుమ్మ బాగా భయపడినట్లు కనిపిస్తోంది.తన ప్రియుడు కిచ్లు తో జీవితాన్నిమొదలు పెడుతున్న ఈ సమయంలో కొత్తగా ఆలోచిస్తోందా.. అంటు పలువురు గుసగుసలు పెట్టుకుంటున్నారు.
కరోనాతో నిర్లక్ష్యంగా ఉండొద్దు. వచ్చిన తర్వాత బాధపడటం కన్నా.. ముందే కొన్నింటికి నో చెప్తే వచ్చే నష్టమేమి లేదని ట్వీట్ లో పేర్కొంది. దాంతో ప్రస్తుతానికి తను సినిమాలకు బ్రేక్ చెబుతున్నట్లు తెలుస్తుంది. మరీ కాజల్ కోసం ఎదురు చూస్తున్న ఆచార్య పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చినట్లు అయిపోయిందని సినీ ప్రముఖులు అంటున్నారు. భారతీయుడు 2 షూటింగ్ ఇంకా ఎప్పుడో తెలియదు, ఇక మంచు విష్ణు సినిమా పూర్తయింది కాబట్టి మరేం ప్రాబ్లం లేదు. కానీ వచ్చిన కష్టమళ్లా.. ఆచార్యకే వచ్చిందని పలువురు చెబుతున్నారు. అయితే ఏం అవుతుందో కొన్ని రోజులు అగితే తెలుస్తుంది అని పలువురు చెబుతున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!