Rajinikanth : సూపర్ స్టార్ రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ లేకపోవటంతో సినిమాల పరంగా ఆయన బిజీ అవుతున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి గత ఏడాది డిసెంబర్ నెలలో రజినీకాంత్ పార్టీ ప్రకటన కార్యక్రమం ఉండాల్సింది. త్వరలో తమిళనాడు రాష్ట్రానికి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ..ఖచ్చితంగా రజిని పోటీ చేస్తారని అందరూ భావించారు. పార్టీ ప్రకటన చేయాలి అనే టయానికి చివరి నిమిషంలో అనారోగ్యానికి గురి కావడంతో.. ఇది దైవ నిర్ణయం కాదని రజనీకాంత్ అభిమానులకు క్షమాపణలు చెప్పి యధావిధిగా సినిమాలపైనే దృష్టి పెడుతూ రాణిస్తున్నారు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇండస్ట్రీలలో చాలావరకు ఇతర హీరోలతో సినిమాలు చేస్తూ మల్టీ స్టారర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసింద. బాలీవుడ్ ఇండస్ట్రీ అయినా అదేవిధంగా సౌత్ లో ఎలాంటి ఇండస్ట్రీ అయినా గాని చాలా వరకు మల్టీస్టారర్ కథలు తరహాలో సినిమాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రజినీకాంత్ టాలీవుడ్ సీనియర్ హీరో జగపతి బాబు తో సినిమా చేయడానికి రెడీ అయినట్లు ..త్వరలో ఈ సినిమా ప్రకటన రానున్నట్లు సమాచారం.
గతంలో వీరిద్దరి కలయికలో కథానాయకుడు, లింగ సినిమా రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ముచ్చటగా మూడోసారి ..వీరిద్దరూ కలిసి సినిమా చేయాలని డిసైడ్ అయినట్లు తమిళ ఇండస్ట్రీలో సరికొత్త టిక్ టాక్ వినపడుతోంది. ఇదిలా ఉంటే తమిళనాడు రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికలలో పోటీ చేస్తున్న పార్టీలు రజినీకాంత్ మద్దతు కూడగట్టాలని భావిస్తున్నాయి. ప్రస్తుతం తమిళనాడులో కీలకమైన నాయకులు లేకపోవడంతో ..కమలహాసన్, బీజేపీ వంటి పార్టీల నేతలు రజినీతో పార్టీ తరుపున ప్రకటన చేయించుకుంటే ..ఎన్నికలలో పొలిటికల్ మైలేజ్ సంపాదించే చాన్స్ ఉంటుందని భావిస్తున్నట్లు తమిళ పొలిటికల్ వర్గాల టాక్.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!