హోటల్స్ లో దొంగతనం చేస్తున్న టాప్ టాలీవుడ్ హీరోయిన్..??

టాప్ హీరోలతో వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్న రష్మిక మందన ఈ ఏడాది ప్రారంభంలో “సరిలేరు నీకెవ్వరు” సినిమా తో అదిరిపోయే బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో బన్నీ నటిస్తున్న “పుష్ప” సినిమాలో హీరోయిన్ ఛాన్స్ అందుకుంది. ఈ భారీ ప్రాజెక్టు మాత్రమే కాక ఇంకా చాలా బిగ్ ప్రాజెక్ట్ లు ఈ అమ్మడు లైన్ లో పెట్టడం జరిగింది. ఇదిలా ఉండగా రష్మిక మందన తాను జీవితంలో చేసిన కొన్ని చిలిపి పనుల సీక్రెట్లు బయట పెట్టడం జరిగింది. అంతేకాకుండా తనకి కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ కూడా ఉన్నాయని ఇటీవల ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేసిన సమయంలో తెలిపింది. 

I can't pretend on screen, I cry and laugh for real'- Cinema expressతనకున్న సరదా అలవాట్లు గురించి రష్మిక మందన మాట్లాడుతూ దొంగతనం అంటే చాలా ఇష్టం అని తెలిపింది. వివిధ షూటింగులకు వెళ్ళిన సమయంలో హోటల్స్ రూమ్ లో స్టే చేసినప్పుడు అక్కడ షాంపూలు దొంగిలించటం తనకు సరదా అని రష్మిక తెలిపారు. అంతే కాకుండా ఓ హోటల్లో పిల్లో కవర్స్ కూడా మయం చేసినట్లు ఈ బ్యూటీ తెలిపింది.

 

సరదా హ్యాబిట్స్ ఒక దొంగతనం మాత్రమే కాదు ప్రతి చిన్నదానికి హైరానా పడిపోతా అని…. ప్రతి చిన్న విషయానికి నవ్వటం నా వీక్నెస్ అని అభిమానులతో చిట్ చాట్ లో రష్మిక మందన తెలిపింది. కొన్నిసార్లు సమయానుకూలంగా కాకుండా ఒక్కసారిగా నవ్వడం వల్ల చాలా మంది వ్యక్తులు కన్ఫ్యూజ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి అని తెలిపింది. ఒక్క నెగిటివ్ మాత్రమే కాకుండా పాజిటివ్ కూడా అభిమానులకు చెప్పి సంథింగ్ స్పెషల్ అనిపించుకుంది రష్మిక మందన.