ధియేటర్లో సినిమా చూసే అందం టీవీల్లో చూస్తే వస్తుందా..? కరోనా నేపథ్యంలో తొమ్మిది నెలలుగా అందరూ టీవీలు, సెల్ ఫోన్లు, కంప్యూటర్లలో మాత్రమే సినిమాలు చూశారు. ధియేటర్లోనే సినిమా చూడండి.. అనే సినిమా వారి మాటలకు అర్ధం కరోనా అర్ధం చెప్పిందనే చెప్పాలి. ధియేటర్లు ఎప్పుడు తెరుస్తారో చెప్పలేని పరిస్థితుల్లో చాలా సినిమాలు ఓటీటీల్లో రిలీజ్ అయ్యాయి. ఇందులో చిన్న సినిమాలు, మీడియం రేంజ్ సినిమాలు ఉన్నాయి. అయితే.. ఇప్పటివరకూ ఓటీటీల్లో సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిన సినిమాలు లేవు. ఇప్పుడు ఆ లోటుని బర్తీ చేసిన మొదటి సినిమాగా తమిళ్ లో ‘సూరారి పొట్రు’.. తెలుగులో ‘ఆకాశమే నీ హద్దురా’ నిలుస్తోంది.
సూర్య హీరోగా నటించిన ఈ సినిమా బంపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. కొన్నేళ్లుగా తెలుగులో తమిళ సినిమాల హవా తగ్గింది. సూర్య తమ్ముడు కార్తీ హీరోగా గత ఏడాది వచ్చిన ‘ఖైదీ’ మినహా సూపర్ హిట్ అయిన సినిమా లేదు. ఇప్పుడు ఆకాశమే నీ హద్దురా.. ఆ స్థాయి హిట్ సాధించిందని రివ్యూలే చెప్తున్నాయి. తమిళ్, తెలుగులో ఎక్కడ చూసినా మంచి రివ్యూలే వస్తున్నాయి. సూర్య నటన, సుధా కొంగర దర్శకత్వం, జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం సినిమాకు ప్లస్ అంటున్నారు. సినిమాలో యాక్షన్, ఫ్యామిలీ సెంటిమెంట్, కంటెంట్ అన్నీ సమపాళ్లుగా కుదిరాయని అంటున్నారు. ధియేటర్లో రిలీజ్ అయ్యుంటే సినిమా కలెక్షన్లు అదిరిపోయేవని టాక్ వస్తోంది.
ధియేటర్లో చూడాల్సిన సినిమా ఇది.. అని ప్రేక్షకులు అంటున్నారంటే సినిమా సక్సెస్ రేంజ్ అర్ధం చేసుకోవచ్చు. సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా ఉండటంతో సినిమా ధియేటర్ ఎక్స్ పీరియన్స్ వేరేగా ఉండేదని అంటున్నారు. ఉమామహేశ్వర ఉగ్రరూపస్య, కలర్ ఫొటో.. సినిమాలకు కూడా ఇదే ఒపీనియన్ వచ్చింది. ఆ సినిమాలు హిట్ టాక్ తెచ్చుకున్నాయి. ఇప్పుడు సూర్య సినిమా పెద్ద ప్రాజెక్ట్ మాత్రమే కాకుండా అంచనాలు కూడా ఉండటంతో వాటిని రీచ్ అయింది. ప్రస్తుతం ధియేటర్లు తెరుచుకున్నా.. ప్రేక్షకులు అలవాటు పడటానికి సమయం పడుతుందని అంటున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!