టాలీవుడ్ యువ కథానాయకుడు నాగశౌర్యకు హైదరాబాద్ పోలీసులు షాకిచ్చారు. మంగళవారం ఆయన ప్రయాణిస్తున్న కారును బంజారా హిల్స్‌లో ఎస్సై రవి ఆపారు. కారు అద్దాలకు బ్లాక్ ఫిలిమ్ ఉండటాన్ని గమనించిన ఆయన రూ.500 ఫైన్ విధించారు. ఇటీవల హీరో అల్లు అర్జున్ క్యారీ వ్యాన్‌కి బ్లాక్ ఫిలిమ్ ఉండటంతో రూ.750లను ఫైన్ విధించారు ట్రాఫిక్ పోలీసులు. బ్లాక్ ఫిలిమ్‌లను కారు అద్దాలకు ఉపయోగించరాదని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.
previous post
next post
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!