Mahesh – Trivikram: మహేశ్ అభిమానులను టెన్షన్ పెడుతున్న త్రివిక్రమ్ ఫార్ములా..!

Share

Mahesh – Trivikram: మహేశ్ అభిమానులను టెన్షన్ పెడుతున్న త్రివిక్రమ్ ఫార్ములా..! అవును ఇప్పుడు దీనికి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఇంతకముందు అతడు, ఖలేజా సినిమాలొచ్చాయి. ఈ రెండు సినిమాలు కమర్షియల్‌గా వర్కౌట్ కాలేదు. అతడు సినిమా విషయంలో ఓవర్ బడ్జెట్ కారణంగా నిర్మాత కాస్త నష్టాలను చూశారు. అయితే మేకింగ్ అండ్ పర్ఫార్మెన్స్ పరంగా అటు మహేశ్‌కు ఇటు త్రివిక్రమ్ కు మంచి పేరొచ్చింది. చెప్పాలంటే ఈ సినిమా తర్వాత అదే ఫార్మాట్‌లో కొన్ని సినిమాలు కూడా వచ్చాయి.

trivikram- formula creating tense in mahesh fans

ఇక ఖలేజా సినిమా కామెడీ పరంగా ఆకట్టుకున్న కథ పరంగా అభిమానులను కూడా ఆకట్టుకోలేకపోయింది. కానీ, బుల్లితెరపై ఖలేజా సినిమా ఎప్పుడు ప్రసారమైన మంచి టీఆర్పీ రేటింగ్‌ను నమోదు చేస్తుంది. ఇక మరోసారి మహేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ పాన్ ఇండియన్ సినిమా మొదలవబోతోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ చివరి దశకు చేరుకోవడంతో జనవరిలో ప్రారంభించి..ఆ తర్వాత రెగ్యులర్ షూటింగ్‌కు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల దీనికి సంబంధించిన చర్చలు కూడా మహేశ్, చిత్ర బృందం మధ్య దుబాయ్‌లో జరిగాయి.

Mahesh – Trivikram: అప్పటి నుంచి అభిమానుల్లో ఓ టెన్షన్ పట్టుకుందట.

అప్పటి నుంచి అభిమానుల్లో ఓ టెన్షన్ పట్టుకుందట. వీరి కాంబినేషన్‌లో రాబోతున్న మూడవ సినిమా కథ కూడా అతడు తరహాలోనే  సీరియస్ గా సాగుతుందని..అలాంటి కథనే మహేశ్‌కు త్రివిక్రమ్ చెప్పినట్టు ఫ్యాన్స్ గ్రూప్‌లో చర్చలు జరుగుతున్నాయట. ఒకవేళ అదే ఫార్ములాను గనక త్రివిక్రమ్ మహేశ్ సినిమాకు రిపీట్ చేస్తే సక్సెస్ పరిస్థితేంటి అని మహేశ్ అభిమానుల్లో కంగారు మొదలైందట. మరి ఇది ఎంతవరకు నిజమో టైటిల్ గాని, కాన్సెప్ట్ పోస్టర్ గానీ రిలీజైతే ఓ క్లారిటీ వస్తుంది. కాగా, ప్రస్తుతం మహేశ్ బాబు సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నాడు. కీర్తి సురేశ్ హీరోయిన్..పరశురామ్ దర్శకుడు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే వచ్చిన టీజర్ భారీ అంచనాలు పెంచగా, వచ్చే ఏడాది ఏప్రిల్ 1న రిలీజ్ అని ప్రకటించారు.


Share

Recent Posts

Devatha 11August 622: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన దేవి.. మా నాన్న ఎవరో చెప్పకపోతే రానన్న దేవి..

దేవి కనిపించడం లేదని రాధ ఇల్లంతా వెతుకుతుంది.. మాధవ్, వాళ్ళ అమ్మ నాన్నలు దేవి కోసం తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేస్తారు.. ఎవ్వరూ లేరని చెబుతారు.. అప్పుడే…

18 mins ago

కొత్త సినిమా నిర్మాతలకు డెడ్ లైన్ పెట్టిన బాలకృష్ణ..??

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇబ్బందుల విషయంలో ఫిలిం ఛాంబర్ షూటింగ్ లు మొత్తం ఆపేయడం తెలిసిందే. దాదాపు వారం రోజులకు పైగానే సినిమా ఇండస్ట్రీలో అన్ని షూటింగులు బంద్…

21 mins ago

ఆగస్టు 11 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 11 - శ్రావణమాసం - గురువారం మేషం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి…

2 hours ago

మ‌హేశ్ నెక్స్ట్ మ‌రింత ఆల‌స్యం.. ఎప్ప‌టికి పోస్ట్ పోన్ అయిందంటే?

రీసెంట్‌గా `స‌ర్కారు వారి పాట‌`తో మ‌రో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబు.. త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో…

3 hours ago

రూ. 10 కోట్లు ఆఫ‌ర్‌.. అయినాస‌రే ఆ ప‌ని చేయ‌న‌న్న బ‌న్నీ?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప‌`. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో మాస్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం…

4 hours ago

హాస్పిటల్ లో హీరోయిన్ టబు..!!

హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…

6 hours ago