Pawan Trivikram: ఇటీవల పవన్ కళ్యాణ్ నటించిన “బీమ్లా నాయక్” సినిమా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ విజయం సాధించడం తెలిసింది. ఫిబ్రవరి నెలాఖరులో రిలీజ్ అయిన ఈ సినిమా పవన్ కెరీర్లోనే రికార్డు స్థాయి కలెక్షన్లు ఓపెనింగ్.. రాబట్టడం జరిగింది. సాగర్ కే చంద్ర దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగ్ లు మరియు స్క్రీన్ ప్లే అందించడం తెలిసిందే. దీంతో సినిమా విజయం సాధించడంలో .. త్రివిక్రమ్ ప్రముఖ పాత్ర పోషించారు. ఈ విషయాన్ని స్వయంగా పవన్ కళ్యాణ్ తో పాటు డైరెక్టర్ సాగర్ కే చంద్ర కూడా తెలియజేశారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో పవన్ కళ్యాణ్ కొత్త సినిమా కి త్రివిక్రమ్.. డైలాగులు అందించడానికి రెడీ అయినట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.
అది మరేంటో కాదు వైష్ణవ్ తేజ్ తో పవన్ నటిస్తున్న మల్టీస్టారర్ సినిమాకి.. స్వయంగా త్రివిక్రమ్ డైలాగులు రాయడానికి రెడీ అయినట్లు ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్ నడుస్తోంది. ఫస్ట్ టైం తన మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తో పవన్ మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నట్లు ఇటీవల ఓ వార్త బయటకు రావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి కావాలని త్రివిక్రమ్ ని పవన్ తీసుకున్నట్లు.. డైలాగులు అందించడానికి త్రివిక్రమ్ నీ ఒప్పించినట్లు.. ఫిలిం నగర్ టాక్.
ఇది కాకుండానే త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ రాజకీయ నేపథ్యం కలిగిన సినిమా చేయనున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్రకటన రానున్నట్లు కూడా టాక్ నడుస్తోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు మూడు సినిమాలు చేశాడు. జల్సా, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి. ఈ మూడింటిలో ఒకటి అట్టర్ ఫ్లాప్ కాగా రెండు సినిమాలు విజయం సాధించాయి. ఈ తరుణంలో మరో సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ చేస్తున్నట్లు వార్తలు రావడంతో అభిమానులు.. వచ్చిన వార్త నిజమే అయితే బాగుంటుందని అంటున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!