ఇంజ‌నీరింగ్ కాలేజీ నేప‌థ్యంలో…

కార్తీక్ ఆనంద్, షాలిని, మున్నా, డింపుల్ హయతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘యురేక’..ఇంజనీరింగ్ కాలేజ్ నేపథ్యంలో లవ్‌ థ్రిల్లర్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కార్తీక్‌ ఆనంద్‌ దర్శకత్వం వహించగా లక్ష్మి ప్రసాద్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రశాంత్‌ తాత ఈ సినిమా ని నిర్మిస్తున్నారు.. లలితకుమారి సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉండగా ఈరోజు హోలీ పండగను పురస్కరించుకుని ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.. చిత్రంలోని ప్రధాన పాత్రలతో రూపొందించిన ఈ పోస్టర్ ఎంతో ఇంటెన్సివ్ గా ఉంటూ చిత్రంపై ఆసక్తిని మరింత పెంచుతుంది. త్వరలో నే విడుదల తేదీని ప్రకటించనున్నారు..