విజయ్ దేవరకొండ ఇపుడు ఓ సంచలనం. అర్జున్ రెడ్డి సినిమా ఏ ముహుర్తమున చేసాడో తెలియదు గాని, ఇక అక్కడినుండి విజయ్ వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. ఇపుడు టాలీవుడ్లో మోస్ట్ పాపులర్ హీరో ఎవరంటే అందరు ఇతని పేరే చెబుతారు. ముఖ్యంగా అమ్మాయిలు అయితే విజయ్ దేవరకొండ అంటేనే పడిచస్తారు. ఇక్కడే కాకుండా ఉత్తరాదిన కూడా అతగాడికి మంచి ఫాలోయింగ్ ఏర్పడిన సంగతి అందరికీ తెలిసిందే. తనను లక్షలాదిగా యువతులు ప్రేమిస్తున్నారని ఓ సర్వే.
ఇక వారి మనోభావాలు ఎక్కడ దెబ్బతింటాయి అని విజయ్ దేవరకొండ పెద్ద త్యాగాన్ని చేయబోతున్నాడు. అదే వివాహం. త్యాగం అంటే అదేదో పూర్తిగా వివాహానికి దూరంగా ఉంటాడని అనుకోవద్దు. కాస్త ఆలస్యంగా చేసుకుంటాడంతే. అదేంటని అనికుంటున్నారా? వివరాల్లోకి వెళితే.. కాఫీ విత్ కరణ్ సీజన్ 7 తాజా ఎపిసోడ్ లో విజయ్ దేవరకొండ ఎవరినైనా ప్రేమిస్తున్నారా? అన్న ప్రశ్న వేసాడు కరణ్. దానికి విజయ్ దేవరకొండ స్పందిస్తూ… “నేను పెళ్లి చేసుకుని పిల్లలను కనే రోజు ఒకటి వుంది. దానిని బిగ్గరగా అందరికీ తెలియజేస్తాను. అంతవరకూ ఎవరూ వూహించుకోవద్దు. అప్పటి వరకు నన్ను ఆరాధించే వారిని బాధపెట్టడం నాకు ఇష్టం లేదు.” అని అన్నాడు.
దాంతో ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ ఎపిసోడ్ లో విజయ్ అసలు ఏ నిజాన్ని అంగీకరించలేదు. తాను ప్రేమలో ఉన్నాడా? ఎఫైర్ ఉందా లేదా? అన్న విషయాలను దాటవేశారు. ‘కాఫీ విత్ కరణ్ సీజన్ 7’ డిస్నీ+ హాట్ స్టార్ లో ప్రత్యేకంగా ప్రసారం కానుంది. నాలుగో ఎపిసోడ్ లో విజయ్ తో అనన్య కూడా సందడి చేసిన విషయం తెలిసినదే. లైగర్ విడుదల ప్రచారంలో భాగంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందుకున్నాడు విజయ్ దేవరకొండ. త్వరలో విజయ్ అనన్యతో కలిసి హైదరాబాద్ లోనూ సందడి చేయనున్నాడు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!