Varisu: తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా వారిసు.. ఇప్పటికే ఈ చిత్రం ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న ఈ ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిట్ రూపొందిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులు అల్లరించాయి.. తాజాగా వారిసు ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

వారిసు ట్రైలర్ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని అర్ధమవుతుంది. వంశీ పైడిపల్లి తనదైన మార్క్ కథతో ఈ సినిమాను తెరకెక్కించినట్లుగా ఈ ట్రైలర్‌లోనే చూపెట్టాడు. విజయ్ తన కుటుంబ పరువును కాపాడుకోవడానికి ఎలాంటి పరిణామాలను ఎదుర్కొనాల్సి వచ్చింది అనేది అసలు సినిమా కథ. ఈ చిత్రంలో విజయ్ రెండు విభిన్నమైన గెటప్స్‌లో కనిపించారు. ఈ సినిమాలో విజయ్ సరసన భామ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుంది..
ఈ సినిమాని దిల్ రాజు సమర్పిస్తున్నారు. వారీసు చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. వారిసు సినిమాపై తమిళ్‌తో పాటు తెలుగులో కూడా మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సంక్రాంతి బరిలో పోటీకి దిగుతున్న వారిసు బాలయ్య , చిరంజీవి సినిమాలను తట్టుకొని నిలబడగలుగుతుందా లేదా అనేది చూడాలి..