NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

కుప్పంలో హైటెన్షన్ .. పోలీసులపై చంద్రబాబు ఫైర్.. ట్విస్ట్ ఏమిటంటే..?

టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటనలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కర్ణాటక సరిహద్దు పెద్దురుకు చేరుకున్న చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. రోడ్ షో, సభలకు అనుమతి లేదని చెప్పడంతో చంద్రబాబు పోలీసులపై ఫైర్ అయ్యారు. తన సొంత నియోజకవర్గంలోకి రాకుండా అడ్డుకుంటారా అంటూ పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. ఏ చట్టం ప్రకారం తాను నియోజకవర్గంలోకి వెళ్లకూడదో నోటీసులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తనకు ఎందుకు అనుమతులు ఇవ్వరంటూ పోలీసులను చంద్రబాబు నిలదీశారు. పోలీసులు రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Chandrababu Kuppam Tour

 

ఏ చట్టంప్రకారం జీవో ను తీసుకువచ్చారో సమాధానం చెప్పాలన్నారు. 1946 నాటి చట్టసవరణను జీవోలో ప్రస్తావించలేదని అన్నారు. 1861 నాటి చట్టాన్ని ఇప్పుడు రుద్దుతారా అని ప్రశ్నించారు. ప్రభుత్వం తెచ్చిన జీవోకు చట్టబద్దత లేదని అన్నారు.ప్రభుత్వం, పోలీసుల దయాదాక్షిణ్యాలతో సభలు పెట్టుకోవాలా అని ప్రశ్నించారు. తన వాహనం ఇచ్చే వరకూ ఇక్కడే ఉంటానని పేర్కొన్నారు. అక్కడే మైక్ తీసుకుని మీడియాతో చంద్రబాబు మాట్లాడారు. ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు చంద్రబాబు. అనంతరం పాదయాత్రగా బయలుదేరిన చంద్రబాబు ఇంటింటి యాత్రను ప్రారంభించారు. రోడ్ షో, సభలకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో చంద్రబాబు తన పర్యటనను ఇంటింటి యాత్రగా మార్చుకున్నారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేస్తూ ముందుకు సాగుతున్నారు.

Chandrababu Kuppam Tour

 

అంతకు ముందు కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం కెనమాకులపల్లి పంచాయతీలో రచ్చబండ కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన వేదికను పోలీసులు తొలగించారు. చంద్రబాబును స్వాగతం పలికేందుకు తరలివచ్చిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. గ్రామాల్లో పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేయగా టీడీపీ కార్యకర్తలు పోలీసులతో వాగ్వివాదానికి బారికేడ్లు అక్కడ నుండి తొలగించారు. పోలీసులు అడ్డుకున్నా కార్యకర్తలు ముందుకు సాగారు.

YSRCP Internal: రాబోయే ఎన్నికల్లో వైసీపీ గెలుపు మళ్లీ ఖాయమే ..! కానీ..?

Chandrababu Kuppam Tour

author avatar
sharma somaraju Content Editor

Related posts

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N