సినిమా

KGF: KGF ‘రాకీ భాయ్’ పాత్ర వెనక వున్న వాస్తవ పాత్ర అతనేనట?

Kgf-market-is-another-level
Share

KGF: KGF చాప్తర్ 1 విజయం తర్వాత KGF 2 అంతకు మించిన స్థాయిలో విజయం సాధించింది. చాప్తర్ 1, 300 కోట్లు వసూలు చేయగా, KGF 11 ఏకంగా 1000 కోట్ల వసూళ్లకు చేరువవుతోంది. ఇది నిజంగా ఎవరూ ఊహించని సంచలన విజయం. కోలార్ బంగారు గనుల మాఫియా నేపథ్యంలోని సాగిన ఈ సినిమాలో రాక్ స్టార్ యష్ సాలిడ్ లుక్ పెర్ఫామెన్స్ లుక్స్ తో యువతకు చేరువయ్యాడు. ఈ ఫ్రాంఛైజీతో ఏకంగా పాన్ ఇండియా స్టార్ గా ఓవర్ నైట్ అవతరించాడు. కన్నడ రాజ్ కుమార్ లు కూడా టచ్ చేయలేని రేంజుకు చేరుకున్నాడంటే అతిశయోక్తి లేదు.

Who is the real character behind KGF 'Rocky Bhai'?
Who is the real character behind KGF ‘Rocky Bhai’?

KGF: ఇంతటి విజయం వెనక స్ఫూర్తి ఏమిటి?

Who is the real character behind KGF 'Rocky Bhai'?
Who is the real character behind KGF ‘Rocky Bhai’?

రాఖీ భాయ్ పాత్ర క్రియేషన్ వెనక రియల్ స్ఫూర్తి ఎవరు? అన్నది ఇపుడు సోషల్ మీడియాలో ఆరా తీస్తే.. ఒక నిప్పులాంటి లాంటి నిజం బయటపడింది. అవును.. నిజానికి రాఖీ భాయ్ లాంటి ఒక డాన్ హిస్టరీలో ఉన్నాడన్నది తేటతెల్లమైంది. నిజానికి యష్ పోషించిన రాఖీ పాత్ర తంగం అనే రియల్ డాన్ లైఫ్ నుండి ప్రేరణ పొందిందని తెలుస్తోంది. తెలిసిన వివరాల ప్రకారం.. రాఖీ పాత్ర 1997లో పోలీసు ఎన్ కౌంటర్ లో కాల్చి చంపబడిన కరుడుగట్టిన నేరస్థుడు రౌడీ తంగం రియల్ లైఫ్ ఆధారంగా రాసుకున్న పాత్ర అట.

కొట్టిపారేసిన నీల్?

అసలు కథలోకి వెళితే, తంగం తల్లి అయినటువంటి పౌలీనా KGF మొదటి భాగంలో తన కొడుకును ప్రతికూలంగా చిత్రీకరించారని ఆరోపిస్తూ, రెండవ భాగం షూటింగ్ పై స్టే విధించాలని కోరుతూ ఒక పిటిషన్ ను దాఖలు చేశారు. ఈ క్రమంలో మేకర్స్ కి కోర్టు సమన్లు జారీ చేసింది. పౌలి వాదన ప్రకారం.. పాత్రను సానుకూలంగా చిత్రీకరిస్తానని బృందం ఆమెకు హామీ ఇచ్చింది. కానీ అలా జరగలేదు. అయితే దర్శకుడు ప్రశాంత్ నీల్ మాత్రం ఈ సినిమా తంగం జీవితం ఆధారంగా తీసింది కాదని ఓ ఇంటర్వ్యూలో కొట్టిపారేశాడు.


Share

Related posts

ప్రభాస్ మరో ఘనత.. ఏషియన్ టాప్ సెలబ్రిటీస్ లో చోటు

Muraliak

Rajnikanth: టాప్ హీరో దర్శకత్వంలో..రజినీకాంత్ 170 వ సినిమా..??

sekhar

Sarkaru Vaari Paata: పక్కా మాస్ ఎంటర్టైనర్..లేటెస్ట్ పోస్టర్‌తో ఫ్యాన్స్‌కు పూనకాలొచ్చేస్తున్నాయ్..

GRK
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar