Akhil: అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన మూడోతరం హీరో అఖిల్. సిసీంద్రి సినిమాలో బుడతడుగా సినిమా మొత్తం ఆకట్టుకున్న అఖిల్ మళీ మనం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించాడు. ఈ సినిమాలో అఖిల్ ఎంట్రీ సీన్ అదిరిపోతుంది. ఈ ఒక్క సీన్‌తో అందరినీ డామినేట్ చేశాడు. ఇక అఖిల్ సినిమాతో ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ఈ అక్కినేని వారసుడు. అయితే మొదటి సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత చేసిన
హలో, మిస్టర్ మజ్ఞు ఓ మాదిరిగా ఆడినప్పటికి అఖిల్‌కు హిట్ దక్కలేదు.
ఇలా మూడు సినిమాలు చేసినా ఒక్క హిట్ కూడా అందుకోకపోవడంతో గట్టిగా ట్రై చేసి అటు అల్లు అరవింద్, ఇటు నాగార్జున తీసుకోవాల్సిన అన్నీ జాగ్రత్తలూ తీసుకొని ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మూవీని తీశారు. ఈ సినిమాతో అఖిల్ ఖాతాలో ఫస్ట్ హిట్ చేరింది. ఈ సినిమాలో అఖిల్ కంటే పూజా పెద్దదిగా కనిపించింది. కథ కూడా అంత గొప్ప కథ కాదు..ఇలాంటి ఎన్నో కామెంట్స్ వచ్చాయి. ఫైనల్‌గా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సూపర్ హిట్ సాధించింది. దాంతో అఖిల్ మంచి జోష్‌లో నెక్స్ట్ సినిమాను చేస్తున్నాడు.
Akhil: ఏజెంట్ సినిమా ఏ స్థాయి సక్సెస్ ఇస్తుందో.
ఈ సినిమాకు దర్శకుడు సురేందర్ రెడ్డి. ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ రెడ్డి సినిమా 2 కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. ఇక ఈ సినిమా కోసం అఖిల్ తెగ కసరత్తులు కూడా చేసి సిక్స్ ప్యాక్ బాడీని పెంచాడు. ఇంత శ్రమించింది కూడా తనకి ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాతో వచ్చిన హిట్‌ను కాపాడుకునేందుకే. ఇప్పుడు హీరోలు చేస్తున్న ఒకటి రెండు సినిమాలు సూపర్ హిట్ అయితే ఆ తర్వాత వరుస బెట్టి ఫ్లాపవుతున్నాయి. మరి అఖిల్ చేస్తున్న ఏజెంట్ సినిమాతో హిట్ అందుకొని నిలదొక్కుకుంటాడా లేక మళ్ళీ ఇబ్బందుల్లో పడతాడా అనేది సురేందర్ రెడ్డి మీదే ఆధారపడి ఉంది. చూడాలి మరి అఖిల్‌కు ఏజెంట్ సినిమా ఏ స్థాయి సక్సెస్ ఇస్తుందో.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!