NTR – Kalyan Ram: ఇటీవల వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ పాన్ ఇండియన్ స్టార్‌గా మారిన సంగతి తెలిసిందే. నందమూరి ఫ్యామిలీలో తారక రామారావు తర్వాత బాలకృష్ణ ఆ తర్వాత ఎన్.టి.ఆర్ ఆ రేంజ్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇక ఇదే నందమూరి ఫ్యామిలీ హీరో ఎన్.టి.ఆర్ సోదరుడు నందమూరి కళ్యాణ్ రామ్ కూడా హీరోగా, నిర్మాతగా సత్తా చాటుతున్నాడు. మంచి కమర్షియల్ హిట్స్ తన ఖాతాలో ఉన్నాయి. అన్న నిర్మాతగా తమ్ముడు హీరోగా వచ్చిన జై లవ కుశ లాంటి సినిమాతో ఇద్దరు సాలీడ్ హిట్ అందుకున్నారు.
అయితే, కళ్యాణ్ రామ్ ఇంకా భారీ సక్సెస్ అందుకోవడంలో తారక్ కంటే ఆమడ దూరంలోనే ఉండిపోయాడు. భారీ చిత్రాలలో నటిస్తున్నా కూడా ఆ క్రేజ్ దక్కడం లేదు. ఇక ఇప్పుడు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో హీరోలందరూ పాన్ ఇండియన్ సినిమాలను చేస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ తర్వాత అల్లు అర్జున్, రామ్ చరణ్, తారక్ ఆ క్రేజ్ అందుకున్నారు. మిగతా హీరోలు కూడా ఆ రేంజ్ స్టార్ డం అందుకోవాలని పట్టుదలతో పాన్ ఇండియన్ కథల్లో నటిస్తున్నారు. ఈ క్రమంలోనే కళ్యాణ్ రామ్ కూడా ఓ పాన్ ఇండియన్ సినిమాతో రాబోతున్నాడు.
NTR – Kalyan Ram: తారక్ రేంజ్ కళ్యాణ్ రామ్ అందుకుంటాడా..?
ఆ సినిమానే బింబిసారా. ఇందులో టైటిల్ రోల్ పోషిస్తున్నాడు కళ్యాణ్ రామ్. మల్లిడి వశిష్ఠ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే బింబిసారా సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ – గ్లింప్స్ కు అందరినీ నుంచి విశేష స్పందన లభించింది. క్రీస్తు పూర్వం ఐదో శతాబ్దానికి చెందిన మగధ రాజ్యాధిపతి బింబిసారుడు కథతో ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ కేటాయించి కళ్యాణ్ రామ్ సమర్పణలో నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్ పై కె.హరికృష్ణ నిర్మిస్తున్నారు. కేథరీన్ ట్రెసా – సంయుక్త మేనన్ మరియు వరీనా హుస్సేన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. మరి ఈ సినిమాతో తారక్ రేజ్
కళ్యాణ్ రామ్మ్ అందుకుంటాడా లేదా చూడాలి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!