Pawan kalyan: దిల్ రాజు ఒత్తిడి చేస్తే పవన్ కళ్యాణ్ డేట్ మార్చేస్తారా..? ఇది జరిగే పనేనా అంటున్నారు నెటిజన్స్. ఎందుకంటే ఇన్ని రోజులు కాస్త హోప్స్ ఉన్న ఫిబ్రవరి 25వ తేదీన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన గని చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తాజాగా చిత్రబృందం ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసి అధికారికంగా ప్రకటించింది. ఇది గీతా ఆర్ట్స్‌లో నిర్మిస్తున్న సినిమా. మెగా హీరో కాబట్టి ఇప్పటికే వాయిదా పడి ఎట్టకేలకు ఫైనల్‌గా రిలీజ్ తేదీని కన్ఫర్మ్ చేసుకున్నారు. కిరణ్ కొర్రపాటి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్ తనయుడు అల్లు బాబి దీనికి నిర్మాతగా వ్యవహరించారు.
బాలీవుడ్ యంగ్ బ్యూటీ సాయీ మంజ్రేకర్ ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అవుతోంది. అయితే, చాలా రోజుల నుంచి మెగా అభిమానులందరూ ఎదురుచూస్తున్న సినిమా భీమ్లా నాయక్. ఈ సినిమాకు ఇప్పటికే రెండు తేదీలను మేకర్స్ ఫిక్స్ చేసుకున్నారు. ఒకటి ఫిబ్రవరి 25, మరోటి ఏప్రిల్ 1వ తేదీన అనుకున్నారు. కానీ ఈ నెలలోనే భీమ్లా నాయక్ సినిమా వస్తుందని భావించారు. కానీ, ఎప్పుడైతే గని సినిమా రిలీజ్ తేదీని ప్రకటించారో ఇక అందరూ ఇక ఈ నెలలో భీమ్లా నాయక్ రాదని ఫిక్సైపోయారు. కానీ, నిర్మాత దిల్ రాజు మాత్రం ఈ సినిమాను అనుకున్నట్టుగానే ఈ నెలలో రిలీజ్ చేయాల్సిందే అంటూ చిత్ర నిర్మాతలను ఒత్తిడి చేస్తున్నారట.
Pawan kalyan: పవన్ కళ్యాణ్‌ను కూడా దిల్ రాజు రిక్వెస్ట్ చేస్తున్నారట.
ఇప్పటికే భీమ్లా నాయక్ సినిమా మూడు సార్లు వాయిదా పడింది. సంక్రాంతి రేసులోనే ఈ సినిమా రావాల్సింది. కానీ, రాధే శ్యామ్ సినిమా కోసం వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ పోస్ట్ పోన్ అంటే ఎలా అని దిల్ రాజు ఆందోళన చెందుతున్నాడట. అందుకు కారణం దిల్ రాజు భీమ్లా నాయక్ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తుండటమే. ఈ కారణంగానే ఎట్టి పరిస్థితుల్లో ఫిబ్రవరి 25నే విడుదల చేయమని నిర్మాత సూర్యదేవర నాగవంశీని ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో పవన్ కళ్యాణ్‌ను కూడా దిల్ రాజు రిక్వెస్ట్ చేస్తున్నారట. పవన్‌తో ఆయన వకీల్ సాబ్ సినిమాను నిర్మించిన సంగతి తెలిసిందే.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!