Bigg Boss 6 Telugu: తెలుగు బిగ్ బాస్ ఆడియెన్స్ ఓటిటి బిగ్ బాస్ షో కోసం ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో ఇప్పటి వరకు ఐదు సీజన్ లు ముగిసాయి. వాస్తవానికి ఒక సీజన్ కంప్లీట్ అయిన తర్వాత మరొకటి స్టార్ట్ కావాలంటే దాదాపు తొమ్మిది నెలలు గ్యాప్ తీసుకునే పరిస్థితి గతంలో ఉండేది. కానీ సీజన్ ఫైవ్ టైటిల్ సన్నీకి ఇచ్చిన సమయంలోనే రెండు నెలలలో నెక్స్ట్ సీజన్ స్టార్ట్ కానున్నట్లు నాగార్జున సంచలన ప్రకటన చేసి బిగ్ బాస్ ఆడియాన్స్ కి బిగ్ సర్ప్రైజ్ ఇవ్వటం జరిగింది.
ఈ నేపథ్యంలో ఓటిటి బిగ్ బాస్ షోలో… మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ లు… కూడా ఆడుతున్నట్లు వార్తలు వచ్చాయి. పరిస్థితి ఇలా ఉంటే తాజాగా డిస్నీ హాట్ స్టార్ లో ఓటిటి బిగ్ బాస్ ఎప్పుడు ప్రసారం కానుందో.. ప్రోమో రిలీజ్ చేసి క్లారిటీ ఇచ్చారు. ప్రోమో లో వెన్నెల కిషోర్ నాగార్జున.. మరికొంతమంది టాలీవుడ్ ప్రముఖులు నటించడం జరిగింది.
కామా లేదు ఫుల్ స్టాప్ లేదు.. నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అంటూ నాగార్జున ప్రోమో లో పలికిన డైలాగ్ హైలెట్ గా నిలిచింది. ఈ క్రమంలో ఫిబ్రవరి 26 నుండి షో ప్రారంభం కానున్నట్లు క్లారిటీ ఇవ్వటం జరిగింది. 24 గంటలు చూపించనున్నట్లు… ప్రోమో లో తెలియజేశారు. ఫస్ట్ టైం తెలుగులో ఓటిటి లో బిగ్ బాస్ స్టార్ట్ కానున్న నేపథ్యంలో కంటెంట్ విషయంలో షో నిర్వాహకులు చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం. ఈసారి ఎటువంటి ఎడిటింగ్ కటింగ్ లేకుండా గతంలో మాదిరిగా 24 గంటలలో.. గంట మాత్రం కాకుండా మొత్తం.. చూపించడానికి షో నిర్వాహకులు రెడీ అవ్వడం తో..ఓటిటి బిగ్ బాస్ ఏ విధంగా ఉంటుందో అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా ఉంది.