ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన “పుష్ప” ఏంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన “పుష్ప” ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెప్పించుకుంది. సినిమా యూనిట్ ఊహకందని రీతిలో పుష్పా మేనియా ప్రపంచంలో విస్తరించింది. సినిమాలో పాటలు బన్నీ మేనరిజం ఇంకా స్టెప్ లు అన్నీ కూడా ప్రాంతాలకు మరియు భాషలకు అతీతంగా గుర్తింపు దక్కించుకున్నాయి. ఇదిలా ఉంటే సుకుమార్ తన సినిమాలకు సంబంధించి షూటింగ్ స్టార్ట్ అవ్వక ముందు కచ్చితంగా ఫారన్ వెళ్ళటం సెంటిమెంట్. విదేశాలలోనే స్క్రిప్ట్ వర్క్ తో పాటు మ్యూజిక్ సెట్టింగ్స్ కూడా సెట్ చేసుకుంటాడు.
గతంలో ఎన్టీఆర్ తో తీసిన “నాన్నకు ప్రేమతో”.. ఇంకా చాలా సినిమాలకు విదేశాలలోనే స్క్రిప్ట్ వర్క్ రెడీ చేయడం జరిగింది. ఇండియాలో ఉంటే డిస్టబెన్స్ ఎక్కువ కారణంగా.. సుకుమార్ విదేశాలకు వెళ్లడం అలవాటు. అయితే సుకుమార్ ఫారిన్ వెళ్లి రెడీ చేసిన అన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి. అయితే ఇప్పుడు సెంటిమెంట్ పరంగా నే “పుష్ప” సెకండ్ పార్ట్ స్క్రిప్ట్ వర్క్ తోపాటు మ్యూజిక్ సెట్టింగ్స్ కూడా వర్క్ మొత్తం విదేశాలలోనే రెడీ చేస్తున్నాడు సుకుమార్. ఆల్రెడీ దేవిశ్రీప్రసాద్ ఇప్పటికే కొన్ని ట్యూన్స్ కూడా వినిపించినట్లు మూడు ఓకే అయినట్లు టాక్. దీంతో సెంటిమెంట్ పరంగా విదేశాలకు వెళ్లి సుక్కు రెడీ చేసిన సినిమాల విజయాల పరంపర “పుష్ప 2” కి వర్క్ అవుట్ అవుతుందో లేదో చూడాలి.
ఇదిలా ఉంటే “పుష్ప 2” మొదటి భాగం కంటే మరిన్ని భాషలలో విడుదల చేయనున్నారట. అంతేకాదు సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు దాదాపు రెండు నెలలు చేయాలని సినిమా యూనిట్ డిసైడ్ అయినట్టు సమాచారం. మరి కొద్ది రోజులలో సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి వచ్చే వేసవికి సినిమా విడుదల చేసే ఆలోచనలు సుకుమార్ ఉన్నారట. ఈ క్రమంలో స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసిన సుకుమార్ మ్యూజిక్ సెట్టింగ్స్ కోసం దేవి శ్రీ ప్రసాద్ తో కూర్చున్నట్లు టాక్.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!