Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి Chiranjeevi ప్రస్థానం తెలుగు సినీ పరిశ్రమలో ఎలా కొనసాగిందో.. కొనసాగుతుందో చూస్తూనే ఉన్నాం. ఇప్పటివరకూ ఆయన కెరీర్లో సాధించినన్ని ఇండస్ట్రీ హిట్లు తెలుగులో మరో హీరోకు లేవంటే అతిశయోక్తి కాదు. బాక్సాఫీస్ వద్ద చిరంజీవి హవా అలా కొనసాగింది. అలా ఆయన కెరీర్లో సాధించిన ఒక అరుదైన ఇండస్ట్రీ హిట్ ‘యముడికి మొగుడు’. 1988 ఏప్రిల్ 29న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తిరుగులేని కలెక్షన్లు సాధించి.. 1987లో పసివాడి ప్రాణంతో చిరంజీవే సాధించిన ఇండస్ట్రీ రికార్డును బద్దలకొట్టింది. అయితే.. ఈ సినిమాను నిర్మించింది ఆయన స్నేహితులు, రూమ్ మేట్స్ కావడం విశేషం. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.
అప్పటికి చిరంజీవి ప్రభ తెలుగులో ఏస్థాయిలో ఉందంటే.. ఓ నిర్మాతకు ఆయన డేట్స్ ఇస్తే అదొక వరం. ఆ టైమ్ లో చిరంజీవితో సినిమా చేయాలని కెరీర్ కు ముందు రూమ్మేట్ అయిన నారాయణ రావు చిరంజీవిని సంప్రదించారు. దానికి చిరంజీవి అంగీకరిస్తూ.. మరో ఇద్దరు రూమ్మేట్స్ అయిన సుధాకర్, హరిప్రసాద్ ను కూడా కలుపుకోవాలని సూచించారట. దీంతో.. ముగ్గురూ కలిసి యముడి కంటెంట్ తో రచయిత సత్యానంద్ తో సోషియో ఫాంటసీ కథ రాయించారు. చిరంజీవికి నచ్చింది. యువ సంగీత దర్శకులుగా పేరు తెచ్చుకుంటున్న రాజ్-కోటికి ఎంచుకున్నారు. వారికి చిరంజీవితో అదే తొలి సినిమా. దర్శకుడిగా రవిరాజా పినిశెట్టిని తీసుకున్నారు. మొత్తంగా ‘యముడికి మొగుడు’ టైటిల్ తో సినిమా నిర్మితమై విడుదలైంది.
తొలిషో నుంచే సినిమాకు బ్రహ్మాండమైన టాక్ వచ్చింది. చిరంజీవి డ్యాన్సులు, ఫైట్లకు ధియేటర్లు దద్దరిల్లిపోయాయి. యముడితో సన్నివేశాలు, కామెడీ, ప్రేక్షకులకు విపరీతంగా నచ్చడంతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కలెక్షన్ల కనకవర్షమే కురిసి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. చిరంజీవి క్రేజ్ మరోస్థాయికి వెళ్లిపోయింది. 45 సెంటర్లలో 100 రోజులు రన్ అయి.. మొత్తంగా 175 రోజులు ఆడింది. చెన్నై మెరీనా బీచ్ లో శతదినోత్సవం ఓ హైలైట్. రూమ్ మేట్స్ కోసం చేసిన ఒక్క సినిమానే ఇండస్ట్రీ హిట్ అయినా.. మళ్లీ ఆ కాంబినేషన్ రిపీల్ కాలేదు. అయినా.. చేసిన ఒక్క సినిమా వన్ మూవీ వండర్ గా నిలిచిందని నారాయణరావు అంటారు. ‘డైనమిక్ మూవీ మేకర్స్’ అని వారి బ్యానర్ కు చిరంజీవే పేరు పెట్టడం విశేషం.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!