సోమవతి అమావాస్య.. డిసెంబర్ 14న వచ్చిన ఈ అమావాస్య కార్తీకమాసంలో రావడం మరింత విశేషమైనది.
ఈ రోజున వివాహితులు, అవివాహితులు రావిచెట్టును 108 సార్లు ప్రదక్షిణలు చేయడం ద్వారా కోరుకున్న కోరికలను తీర్చుకోవచ్చునని జ్యోతిషవేత్తలు తెలుపుతున్నారు. ఇక జాతకంలో సర్పదోషాలు వున్నా అవి కూడా తొలగిపోతాయి. కాల సర్పదోషాలు తొలగిపోవడానికి సులభమైన మార్గం.. సోమవతి అమావాస్య రోజున రావిచెట్టు చుట్టూ 108 సార్లు ప్రదక్షిణాలు చేసినట్లయితే అంతా శుభం కలుగుతుంది.
ఈ అమావాస్యను మౌని అమావాస్య , శని అమావాస్య అని కూడా పిలుస్తారు. సోమవతి అమావాస్య రోజున రావిచెట్టును 108 సార్లు ప్రదక్షిణలు చేసేవారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి.
సోమవతి అమావాస్య సమయ విశేషాలు ఇవే…
డిసెంబర్ 13 అర్ధరాత్రి 12:46 నుండి డిసెంబర్ 14 రాత్రి 10:20 వరకు అమావాస్య తిధి కలదు.