Vastu: వాస్తు శాస్త్రంలో దిశలు అనేవి చాలా ముఖ్యమైనవిగా పరిగణించబడతాయి ఈమధ్య కాలంలో ప్రతి వ్యక్తి కూడా వాస్తు ప్రకారమే తన ఇంటిని నిర్మించుకుంటూ ఇంటిలో వస్తువులను కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు ముఖ్యంగా సరైన దిశ వాస్తు జాగ్రత్తలు తీసుకోకపోతే ఇంటి సభ్యులు అనేక దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అటువంటి సందర్భాలలో ఇంట్లో ఉంచిన వస్తువులు షో పీస్ లను సరైన దిశలో ఉంచడం అనేది చాలా ముఖ్యం.

ఇకపోతే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని వస్తువులను దక్షిణ దిశలో ఉంచడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఆర్థికంగా ఎదిగేందుకు ఉపయోగపడుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది అలాగే దక్షిణ దిశను యమా పూర్వీకుల దిశగా భావిస్తారు అందుకే ఈ దిశలో ఉంచిన కొన్ని వస్తువులు మిమ్మల్ని ఆర్థికంగా బలపడేలా చేస్తాయి. అలాగే చీపురుని కూడా వాస్తు ప్రకారం ఇంటికి దక్షిణ దిశలో ఉంచడం మంచిదని భావిస్తారు. అయితే దీనివల్ల ఆ ఇంటి యజమానికి బాగా కలిసి వస్తుంది. ఆర్థికంగా మరింత అభివృద్ధి జరుగుతుంది.
అలాగే ఎల్లప్పుడూ హాలులో లేదా డ్రాయింగ్ రూమ్లో జాడే మొక్కను దక్షిణ దిశలో ఉంచడం వల్ల కుటుంబానికి మంచి శ్రేయస్సు తో పాటు ఆర్థిక అభివృద్ధి కూడా కలుగుతుంది. అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం ఫీనిక్స్ పక్షి చిత్రాన్ని కూడా ఇంటికి దక్షిణ దిశలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సు నెలకొంటాయి. అలాగే దాంపత్య జీవితం ఆనందంగా ఉండటమే కాదు ప్రశాంతంగా సాగుతుంది. ఇంట్లో విలువైన వస్తువులు ఏవైనా ఉన్నా సరే వాటిని ఎప్పుడు దక్షిణ దిశలోనే ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు. కనుక వర్షం కురుస్తుంది.