NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Jayanagar: కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే సౌమ్యారెడ్డికి దెబ్బేసిన సౌమ్యారెడ్డి.. రీకౌంటింగ్ లో తారుమారైన ఎన్నికల ఫలితం

BJP's CK Ramamurthy defeats Congress candidate sowmya reddy by 16 votes in Jayanagar

Jayanagar:ఎన్నికల్లో అభ్యర్ధులు తమ ప్రత్యర్ధులను దెబ్బతీసేందుకు రకరకాల వ్యూహాలను అమలు చేస్తుంటారు. పాలిటిక్స్ (రాజకీయం) చేయడమే కాదు పాలిట్రిక్స్ (కన్నింగ్ రాజకీయం) కూడా చేస్తుంటారు. ఈ కారణంగా ప్రజల్లో అభిమానం ఉన్న నాయకులు సైతం స్వల్ప ఓట్ల తేడాతో పరాజయం పాలవుతుంటారు. ఇటువంటి సంఘటనే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జయనగర్ లో జరిగింది. ఇక్కడ రీకౌంటింగ్ లో ఫలితం తారు మారు అయ్యింది. ముందుగా గెలుపొందిన సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సౌమ్య రెడ్డి రీ కౌంటింగ్ తర్వాత 16 ఓట్ల స్పల్ప తేడాతో పరాజయం పాలైయ్యారు.

BJP's CK Ramamurthy defeats Congress candidate sowmya reddy by 16 votes in Jayanagar
BJP’s CK Ramamurthy defeats Congress candidate sowmya reddy by 16 votes in Jayanagar

 

ఇక్కడ గమ్మతైన విషయం ఏమిటంటే బీజేపీ అభ్యర్ధి సీకే రామమూర్తిని స్వతంత్ర అభ్యర్ధి బీ రామమూర్తి ఓడించలేకపోయినా, కాంగ్రెస్ అభ్యర్ధి సౌమ్యరెడ్డిని స్వతంత్ర అభ్యర్ధి సౌమ్య ఎ రెడ్డి ఓడించింది. అదేంటి స్వతంత్ర అభ్యర్ధి ఓడించడం ఏమిటని అనుకుంటున్నారా..? క్కడే ఉంది ట్విస్ట్. జయనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలతో పాటు ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్ధులు కలిపి మొత్తం 15 మంది బరిలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్ధి సౌమ్య రెడ్డి పేరుతో స్వతంత్ర అభ్యర్ధి, బీజేపీ అభ్యర్ధి రామమూర్తి పేరుతో మరో స్వతంత్ర అభ్యర్ధి రంగంలో ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే సౌమ్యరెడ్డి, బీజేపీ అభ్యర్ధి రామమూర్తి మధ్య పోటీ నువ్వా నేనా అన్న రీతిలో జరిగింది.

శనివారం కౌంటింగ్ పూర్తి అయిన తర్వాత సిట్టింగ్ ఎమ్మెల్యే సౌమ్య రెడ్డి విజయం సాధించినట్లుగా ఎన్నికల అధికారులు ప్రకటించారు. కేవలం 160 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్ధి విజయం సాధించడంతో బీజేపీ అభ్యర్ధి సీకే రామమూర్తి రీకౌంటింగ్ కు పట్టుబట్టారు. ఆ సమయంలో ఇద్దరు అభ్యర్ధుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం జరిగింది. చాలా సేపు బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య వాగ్వివాదం జరగడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నెలకొన్నారు. ఈ నేపథ్యంలో రీకౌంటింగ్ నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు సద్దమైయ్యారు. పరిస్థితి విషమించడంతో పోలీస్ ఉన్నతాధికారులు  అదనపు బలగాలను రంగంలో దింపారు.

కాంగ్రెస్ అభ్యర్ధి సౌమ్య రెడ్డి తండ్రి, కర్ణాటక మాజీ మంత్రి రామలింగారెడ్డి ఎన్నికల అధికారుల తీరుపై మండిపడ్డారు. కౌంటింగ్ విషయంలో తారుమారు జరిగితే తాము న్యాయపోరాటం చేస్తామని అధికారులను హెచ్చరించారు. రీకౌంటింగ్ లో 16 ఓట్ల తేడాతో రామమూర్తి విజయం సాధించారు.  కాంగ్రెస్ అభ్యర్ధి సౌమ్య రెడ్డికి 57,781 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్ధి సీకే రామమూర్తికి 57,797 ఓట్లు వచ్చాయి. 16 ఓట్ల తేడాతో సౌమ్య రెడ్డి ఓటమి పాలవ్వగా, అదే పేరుతో పోటీలో ఉన్న స్వతంత్ర అభ్యర్ధికి 320 ఓట్లు పోల్ అవ్వడం గమనార్హం. బీజేపీ అభ్యర్ధి పేరుతో బరిలో ఉన్న స్వతంత్ర అభ్యర్ధికి 203 ఓట్లు వచ్చాయి. దీంతో సౌమ్యరెడ్డిని సౌమ్యరెడ్డే ఓడించినట్లు అయ్యింది. కాంగ్రెస్ ఎత్తుగడ ఫలించలేదు కానీ బీజేపీ ఎత్తుగడ ఇక్కడ ఫలించినట్లు అయ్యింది.

Karnataka Congress: ఉమ్మడి కృషితో కాంగ్రెస్ ఘన విజయం .. సీఎం పదవిపై సర్వత్రా ఉత్కంఠ

Related posts

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju