కార్తీకమాసం.. పవిత్రమైన మాసాలలో అత్యంత పవిత్రమైనదిగా కార్తీకాన్ని భావిస్తారు. అయితే ఈ మాసంలో అనేక విశేషాలు.
ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో కార్తీక స్నానాలు, దీపాలు, క్షేత్ర దర్శనం, ఆహార నియమం, దానాలు, దీప దానం, నిత్యా దైవ నామ స్మరణ విశేష ఫలితాలు ఇస్తాయి. కార్తీక మాసంలో సోమవారాలు అత్యంత విశేషమైనవి. అదేవిధంగా పౌర్ణమి, ఏకాదశి తిథులు కూడా చాలా ముఖ్యమైనవి.
కార్తీక మాసం శివ కేశవులకు ఇరువురికి ప్రధానమైనది. కార్తీక మాసంలో సోమవారాలు శివారాధన, శనివారం విష్ణు ఆరాధన, నాగులు చవితి, కార్తీక పౌర్ణమి, ముఖ్యంగా కార్తీక మాసంలో ఆదివారం.. చేసే పూజలు చాలా విశేష ఫలితాన్ని ఇస్తుంది..ఆదివారం మాంసం తినకుండా కులదేవతను ఉపాసించాలి రోజు సూర్యుడికి నమస్కారం చేయాలి ఆదివారం రాత్రి అన్నం తినకుండా ఏదైనా అల్పాహారం తీసుకోవచ్చు.