NewsOrbit
Featured దైవం న్యూస్

Today Horoscope జనవరి 31 ఆదివారం ఈరోజు రాశి ఫలాలు.

Daily horoscope in telugu

Today Horoscope జనవరి  31  పుష్య మాసం – ఆదివారం ఈరోజు రాశి ఫలాలు

మేష రాశి : ధన లాభాం పొందుతారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మంచి ప్రభావాన్ని కలిగి ఉంటారు. పెట్టుబడులు పెట్టి ధన లాభాం పొందుతారు. ఇతరులకు సహాయం చేయడానికి కష్టపడతారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. వస్తు లాభం కలుగుతుంది. అప్పులు చేయడానికి దూరంగా ఉంటారు. బలమైన ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. విహార యాత్రలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి తగ్గించుకొని ప్రశాంతంగా ఉంటారు. విద్యార్థులు కష్టపడి చదువుకుని పోటీపరీక్షల్లో విజయం పొందుతారు.
రెమిడీ: హయగ్రీవ స్తోత్రం పారాయణం చేసుకోండి.

Today Horoscope - Daily horoscope in telugu
Today Horoscope Daily horoscope in telugu

వృషభ రాశి : వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా నడపడం మంచిది, ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంది. అప్పులు తీసుకోవడం ఇవ్వడం చేయకుండా ఉండటం మంచిది. కుటుంబ సభ్యులతో కోపంగా మాట్లాడడం వల్ల ఇబ్బంది. చేపట్టిన పనులు ఆటంకాలు కలగడం వలన ప్రశాంతత కోల్పోతారు. ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. ఇతర సభ్యులతో కలిసి చేయడం మంచిది. వ్యసనాలకు దూరంగా ఉండండి. అనవసర ఖర్చులు చేయకుండా ఉండటం మంచిది. సంపద తక్కువ ఖర్చు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. అవసరం లేని పనులు చేయడం వల్ల సమయం వృధా అయ్యే అవకాశం ఉంది. ఇతరులతో మాట్లాడినప్పుడు తొందరపడి మాట్లాడకుండా ఆలోచించి మాట్లాడడం మంచిది. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు ఏర్పడతాయి. విద్యార్థులు చదువు మీద శ్రద్ధ పెట్టి చదువుకోవడం మంచిది.
రెమిడీ: కామాక్షి అమ్మవారి ఆరాధన చేసుకోండి అంతా శుభప్రదం.

మిధున రాశి : ఈరోజు పదోన్నతులు అందుకుంటారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అప్పుల బాధలు పెరిగిన వాటి నుంచి తెలివిగా బయటపడతారు. నిరుద్యోగులు తెలివిగా ఉంటూ ఉద్యోగం పొందుతారు. సమయస్పూర్తి కలిగి ఉంటారు. ఆధ్యాత్మిక చింతన ఏర్పరచుకుంటారు. ఉద్యోగస్తులు ఆఫీసులో పదోన్నతులు అందుకుంటారు. సమస్యలకు పరిష్కారం వెతుక్కుంటారు. ఉన్నత వ్యక్తులని కలుసుకొని ఆనందంగా ఉంటారు. ఇంతకుముందు ఆగిపోయిన పనులను తిరిగి పూర్తి చేసుకుంటారు. వ్యాపారాల్లో అధిక లాభాలు పొందుతారు. విద్యార్థులు పెద్దల మాటలను, సూచనలను పాటించి శ్రద్ధ పెట్టి చదువుకుంటారు.
రెమిడీ: ఈరోజు అష్టాదశ పీఠ స్తోత్ర పారాయణం చేసుకోండి.

కర్కాటక రాశి : ప్రశాంతత కోల్పోతారు !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. ఆయన వారితో గొడవలు పడే అవకాశం ఉంది. అనవసరపు ఆలోచనలు చేయడం వలన మనోవేదన కలిగే అవకాశం ఉంది. చేపట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తి చేయలేక వాయిదా పడే అవకాశం ఉంది. ఈరోజు ప్రశాంతత కోల్పోతారు. అనవసరపు కొనుగోలు చేయడం వల్ల ధన నష్టం జరిగే అవకాశం ఉంది. ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. వ్యసనాలకు దూరంగా ఉండండి. కోపాలకు దూరంగా ఉండటం మంచిది లేదంటే మీరంటే ఇష్టపడే వారిని దూరం చేసుకుంటారు. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు తెలివిగా సమయస్ఫూర్తిగా మాట్లాడటం మంచిది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడం వలన నష్టాలు ఏర్పడే అవకాశం ఉంది.
రెమిడీ: ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసుకోండి.

సింహరాశి : ఆభరణాలను కొనుగోలు చేస్తారు !

ఈరోజు ఆనందంగా ఉంటుంది. మిత్రులతో సంతోషంగా ఉంటారు. అన్ని విషయాల్లో నూతన నిర్ణయాలు తీసుకుంటారు. బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. మీకు అయినవారు డబ్బు సహాయం చేసే అవకాశం ఉంది. సమయానికి డబ్బులు చేతికి అందుతాయి. ధన వృద్ధి పెంచుకుంటారు. కుటుంబ సభ్యులతో, అందరితో సఖ్యతగా కలిసిమెలిసి ఉంటారు. ఇంతకుముందు విభేదాలు వచ్చినా భార్యాభర్తలు సంతోషంగా అన్యోన్యంగా ఉంటారు. వ్యాపారాలను విస్తరించడం వలన వల్ల స్వల్ప లాభం పొందుతారు. గొప్ప గొప్ప ఆలోచనలు చేస్తారు. పుస్తకాలు చదవడానికి శ్రద్ధ చూపుతారు. పౌష్టికాహారాన్ని తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడు కుంటారు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. విద్యార్థులు చదువు మీద శ్రద్ధ పెట్టి చదువుకొని కొత్త కొత్త ప్రయోగాలు చేస్తారు.
రెమిడీ: ఈరోజు కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆరాధన చేసుకోండి.

కన్యారాశి : ఈరోజు ఒత్తిడికి లోనవుతారు !

ఈరోజు కొంచెం కష్టంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి లేనందువల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. మీ దగ్గరి మిత్రులు మిమ్మల్ని దూరం పెట్టే అవకాశం ఉంది. అప్పుల బాధలు పెరిగిపోయి మానసిక ఒత్తిడికి లోనవుతారు. ధన నష్టం జరిగే అవకాశం ఉంది. అనుకున్న పనులను అనుకున్న సమయంలో పూర్తి చేయడానికి కష్టపడతారు. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి కష్టపడతారు. వ్యసనాలకు దూరంగా ఉండడం మంచిది. వాహన ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా చేయడం మంచిది, చిన్న చిన్న ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంది. మీరు చేయని తప్పులకు ఎదుటి వారు మీ మీద నిందలు వేసే అవకాశం ఉంది. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు ఏర్పడతాయి. శ్రమ పడతారు. దానికైనా ఎక్కువగా ఆశ పడడం వల్ల నష్టం జరుగుతుంది. విద్యార్థులు చదువు మీద శ్రద్ధ పెట్టడం మంచిది. మనోవేదనకు లోనయ్యే అవకాశం ఉంది.
రెమిడీ: 11నవగ్రహ ప్రదక్షణలు చేసుకోండి.

తులారాశి : గ్రహాన్ని కొనుగోలు చేస్తారు !

ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి లాభాలు పొందుతారు. అప్పుల బాధలు తీరిపోతాయి. ధన లాభం పొందుతారు. గొడవలకు దూరంగా ఉండండి. తక్కువ మాట్లాడడం మంచిది. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంది. నూతన గ్రహాన్ని కొనుగోలు చేస్తారు. కొత్త వాహనాలను కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన చేస్తారు. విద్యార్థులు విద్య మీదనే శ్రద్ధ వహించడం మంచిది. స్త్రీలకు కుటుంబంలో బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది.
రెమిడీ: ఈరోజు గణపతి స్తోత్రం పారాయణం చేసుకోండి.

వృశ్చిక రాశి : ఈరోజు అన్యోన్యంగా ఉంటారు !

ఈరోజు అనుకూలంగా లేదు. తొందరపడి ఎవరిని నమ్మకుండా ఉండటం మంచిది, మాయమాటలు చెప్పి మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. అనవసర ఖర్చులు చేయకుండా ఉండటం మంచిది, నష్టం జరిగే అవకాశం ఉంది. ఎలాంటి పనులను అయినా తొందర పడకుండా ఆలోచించి చేయడం మంచిది. ఇంటిని అందంగా చేసుకోవడానికి ఆసక్తి చూపుతారు. రాబోయే రోజుల గురించి బాగా ఆలోచిస్తారు. విద్యార్థులు స్నేహితులతో కలిసి కష్టపడి చదువుకుంటారు. వ్యాపారాల్లో స్వల్ప లాభాలు కలుగుతాయి. అందరితో అన్యోన్యంగా ఉంటారు.
రెమిడీ: ఈరోజు లలితా చాలీసా పారాయణం చేసుకోండి.

ధనస్సు రాశి : ధన లాభం పొందుతారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. తెలివిగా, సమయస్ఫూర్తిగా ఉంటారు. చేపట్టిన పనులను అనుకున్న సమయంలో కష్టపడి పూర్తి చేస్తారు. చేపట్టిన ప్రతి పనిలో విజయం పొందుతారు. వ్యాపారాలను విస్తరించుకొని అధిక లాభాలు పొందుతారు. ఏ విషయంలోనైనా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. గతంలో వసూలు కాని మొండి బకాయిలను ఈరోజు వసూలు చేసుకుంటారు. ధన లాభం పొందుతారు. ఆగిపోయిన పనులను తిరిగి పూర్తి చేసుకుంటారు. కోపాలకు దూరంగా ఉండి మెప్పు లను పొందాలని కుంటారు. ఉద్యోగస్తులకు ఆఫీసుల్లో మంచి అభివృద్ధి కనిపిస్తుంది.
రెమిడీ: దత్త చరిత్ర పారాయణం చేసుకోండి.

మకర రాశి : ఈరోజు బాగా చదువుకుంటారు !

ఈరోజు అనుకూలంగా లేదు. తొందరపడి ఎవరిని నమ్మకుండా ఉండటం మంచిది, మోసపోయే అవకాశం ఉంది. అనవసరపు విషయాల్లో చర్చించడం వలన నష్టపోయే అవకాశం ఉంది. కోపంగా మాట్లాడటం వల్ల మిమ్మల్ని ప్రేమించే వారు దూరం అయ్యే అవకాశం ఉంది. ఆప్త మిత్రులు కూడా దూరమయ్యే అవకాశం ఉంది. విద్యార్థులు భవిష్యత్తు గురించి ఆలోచించి బాగా కష్టపడి చదువుకుంటారు. స్త్రీలకు వస్తు లాభం కలుగుతుంది.
రెమిడీ: ఈరోజు విశ్వనాథ అష్టకం పారాయణం చేసుకోండి.

కుంభరాశి : మనోవేదనకు గురవుతారు !

ఈరోజు కష్టంగా ఉంటుంది. ఎవరినైతే కావాలనుకుంటున్నారో వారి దూరం అయ్యే అవకాశం ఉంది. కుటుంబంలో సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ఉన్న ఇబ్బందుల వల్ల మీరు నష్టపోతారు. ఆప్తమిత్రులు దూరం అయ్యే అవకాశం ఉంది. సరైన సమయానికి నిద్రాహారాలు తీసుకోకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఎలాంటి విషయంలో అయినా తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం మంచిది, ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది లేదంటే సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. వ్యాపారాల్లో ఒడిదుడుకులు వల్ల నష్టం జరిగే అవకాశం ఉంది. విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవడం మంచిది, ఎక్కడైనా పోగొట్టుకునే వీలుంది. మీకు నచ్చని పనులు చేయడం వల్ల మనోవేదనకు గురవుతారు. సమయానికి డబ్బులు చేతికి అందక పోవడం వల్ల ఆందోళన పడతారు. అనవసరపు ఖర్చులకు దూరంగా ఉండటం మంచిది. ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఆఫీసుల్లో మానసిక ఇబ్బందులు తగ్గుతాయి.
రెమిడీ: శ్రీ లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చేసుకోండి, దగ్గర్లో ఉన్న నరసింహ స్వామి ఆలయానికి వెళ్లి దర్శించుకోండి.

మీన రాశి : పుస్తకాలను చదవడానికి ఆసక్తి చూపుతారు !

ఈరోజు బాగుంటుంది. అందరితో సఖ్యతగా కలిసిమెలిసి ఉండాలనుకుంటారు. వ్యాపారాన్ని వృద్ధిలోకి తెచ్చుకొని లాభాలు పొందాలనుకుంటారు. ధర్మానికి, పరువు ప్రతిష్టలకు ప్రాధాన్యతఇస్తారు. చేపట్టిన పనులను శ్రద్ధగా కష్టపడి పూర్తి చేస్తారు. కొత్త ప్రాంతాలకు వెళ్లడానికి మక్కువ చూపుతారు. క్రొత్త పుస్తకాలను చదవడానికి ఆసక్తి చూపుతారు. మానసిక ప్రశాంతంగా ఉండాలనుకుంటారు. ఆధ్యాత్మిక తత్వం ఏర్పడుతుంది. ఇతరులకు సహాయం చేయాలనుకుంటారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. కంప్యూటర్ విద్య నిపుణులు అవుతారు.
రెమిడీ: ఈరోజు విష్ణుసహస్రనామ పారాయణం చేసుకోండి.

author avatar
kavya N

Related posts

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju