NewOrbit
Cinema సినిమా

లోకేష్ నయా ప్లాన్ ఇదే… ఈసారి విజయ్ కి ప్రతినాయకుడిగా బాలీవుడ్ దిగ్గజం!

Share



లోకేష్ కనగరాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఖైదీ..`విక్రమ్` చిత్రాలతో నయా దర్శకుడి పేరు పాన్ ఇండియా స్థాయిలో మారు మ్రోగిపోతుంది. బడా హీరోలు సైతం ఇపుడు లోకేష్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి అంటే అర్ధం చేసుకోండి. ఇక ఎంతోమందిని కాదని లోకేష్ తదుపరి చిత్రాన్ని ఇళయదళపతి విజయ్ తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాపై అభిమానులు సహా ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. వాటికి తగ్గట్టే విజయ్ పాత్రని గ్యాంగ్ స్టర్ గా మలిచారు.



ఇకపోతే లోకేష్ హీరోని గ్యాంగ్ స్టర్ పాత్రలో ఎలా ఎలివేట్ చేస్తాడో అందరికీ తెలిసిందే. దానికి ఉదాహరణే ఇటీవల వచ్చిన ‘విక్రమ్’ సినిమా. ఈసారి ఏకంగా కోలీవుడ్ సూపర్ స్టార్ నే గ్యాంగ్ స్టర్ గా చూపిస్తున్నాడంటే ఆ పాత్ర నెక్స్ట్ లెవల్లో ఉంటుందని తమిళ తంబీలు అంచనాలు వేసుకుంటున్నారు. ఇకపోతే, విశ్వసనీయ వర్గాల ప్రకారం విజయ్ ని ఢీకొట్టడానికి ఏకంగా బాలీవుడ్ నటుడ్నే రంగంలోకి దించుతున్నట్లు సమాచారం. మున్నాభాయ్ సంజయ్ దత్ ని ప్రధాన విలన్ పాత్రకి ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

Advertisements



ఇక ఇదే నిజమైతే సినిమా స్పాన్ ఇంకా పెరుగుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. మున్నాభాయ్ ఇమేజ్ తో బాలీవుడ్ ని సైతం షేక్ చేయోచ్చు. ఇటీవలే సంజయ్ దత్ కేజీఎఫ్ చాప్టర్ 2లో ప్రతినాయకుడి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. అధీరా పాత్రలో సంజయ్ దత్ దుమ్ముదులిపేసారు. పవర్ పుల్ రోల్ లో అద్భుతంగా నటించారు. హిందీ బెల్ట్ లో వందల కోట్లు వసూళ్లు సాధించిందంటే దాని వెనుక దత్ ప్రమేయం ఉందని చెప్పక తప్పదు. ఈ పాత్రని మెచ్చే లోకేష్ కనగరాజ్ తన సినిమా కోసం సంజయ్ దత్ ని తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.


Share

Related posts

రిలీజ్ ఆపేస్తే 25 కోట్లు

Siva Prasad

Pawan Kalyan : తన స్పీచ్ తో రికార్డుల వేట స్టార్ట్ చేసిన పవన్ కళ్యాణ్..!!

sekhar

`భాగ్య‌న‌గ‌ర‌వీధుల్లో గ‌మ్మ‌త్తు`కి సిద్ధం కండి

Siva Prasad