Kurchi Madathapetti: “గుంటూరు కారం”… “కుర్చీ మడతపెట్టి” సాంగ్ ప్రోమో ఒక్కసారిగా సినిమాపై అంచనాలను పెంచేసింది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అందించిన సంగీతం మాస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంది. ఫుల్ మాస్ మసాలా సాంగ్ కావడంతో అభిమానులు ఈ సాంగ్ పట్ల సంబరాలు చేసుకుంటున్నారు. కేవలం 12 గంటల్లోనే రెండు మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి యూట్యూబ్లో దూసుకుపోతూ ట్రెండింగ్ లో ఉంది. మరి ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు వేసిన మాస్ స్టెప్ లు… చాలా చూడముచ్చటగా ఉండటంతో అభిమానులు ఫుల్ హ్యాపీ అయిపోతున్నారు. ప్రస్తుతం యూట్యూబ్ లో ఈ సాంగ్.. దుమ్మురేపుతోంది. ఇప్పటివరకు గుంటూరు కారం నుండి రెండు సాంగ్స్ విడుదలయ్యాయి.
రెండు కూడా పర్వాలేదు అనిపించగా “కుర్చీ మడత పెట్టే” సాంగ్ ఒక్కసారిగా సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. ఒకపక్క నెగిటివ్ కామెంట్లు వస్తున్నా కానీ.. సినిమాకి రావలసిన అంత ప్రచారం ఈ సాంగ్ ప్రోమో తోనే వచ్చేసింది. ఇక ఈ కుర్చీ మడత పెట్టి ఫుల్ సాంగ్ సాయంత్రం నాలుగు గంటలు ఐదు నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ టైం తెలియజేశారు. దీంతో ఈ సాంగ్ కోసం అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా “సర్కారు వారి పాట” 2022 మే నెలలో విడుదల అయింది. ఆ తర్వాత ఇప్పటివరకు ఏ సినిమా విడుదల కాలేదు. 2023 వ సంవత్సరంలో మహేష్ నుండి ఒక్క సినిమా రిలీజ్ కాలేదు.
దీంతో “గుంటూరు కారం” సినిమాపై మహేష్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. పైగా త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు మూడోసారి నటిస్తూ ఉండటంతో అభిమానులు సినిమా ఫలితం పై ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన అతడు, ఖలేజా రెండు సినిమాలు అభిమానులను ఆకట్టుకున్నాయి. రెండింటిలో మహేష్ బాబు చాలా వైవిధ్యంగా కనిపించారు. ఇప్పుడు మూడోసారి “గుంటూరు కారం”లో చాలా మాస్ పాత్రలో కనిపిస్తూ ఉండటంతో అభిమానులు సినిమాపై రోజురోజుకీ అంచనాలు పెంచేసుకుంటున్నారు.