NewsOrbit
Cinema Entertainment News న్యూస్ సినిమా

Snigdha: ఐదో తరగతిలోనే చేదు అనుభవం.. 43 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోక‌పోవ‌డానికి కార‌ణం అదే అంటున్న స్నిగ్ధ!!

Snigdha: న‌టి స్నిగ్ధ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. రాజమండ్రి జ‌న్మించిన స్నిగ్ధ.. ఏలూరు లోని సి.ఆర్ రెడ్డి కళాశాలలో ఎం.బి.ఎ చ‌దువుకుంది. స్ట‌డీస్ కంప్లీట్ అయ్యాక‌ హైదరాబాదులోని లాజికల్ బైట్స్ లో హెచ్.ఆర్ మేనేజరుగా కెరీర్ ప్రారంభించింది. ఈ కార్య‌క్ర‌మంలోనే స్నిగ్ధను చూసిన లేడీ డైరెక్ట‌ర్ నందినీ రెడ్డి.. ఆమె త‌న `అలా మొద‌లైంది` చిత్రంలో అవ‌కాశం ఇచ్చింది. ఈ చిత్రంలో పింకీ పాత్రలో అల‌రించింది. అమ్మాయి అయినా కూడా అబ్బాయి వేషాదార‌ణ‌లో క‌నిపిస్తూ స్నిగ్ధ ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు సంపాదించుకుంది.

మేం వయసుకు వచ్చాం, రొటీన్ లవ్ స్టోరీ, ద‌మ్ము, టైగ‌ర్‌, ఒక్కడినే, గుంటూర్ టాకీస్, కల్యాణ వైభోగమేతో స‌హా ఎన్నో చిత్రాల్లో స్నిగ్ధ న‌టించింది. అలాగే బుల్లితెర‌పై సూపర్ క్వీన్ అనే షోలో పార్టిసిపేట్ చేసి టైటిల్ గెలుచుకుంది. అంతేకాకుండా సింగర్‌గానూ రాణిస్తోంది. ఇప్ప‌టికే పలు షోస్‌లో పాల్గొని మంచి సింగర్‌గా నిరూపించుకుంది. ప్రొఫెష‌న‌ల్ లైఫ్ లో సూప‌ర్ స‌క్సెస్ అయిన స్నిగ్ధ.. ప‌ర్స‌న‌ల్ లైఫ్‌లో మాత్రం బాగా వెన‌క‌ప‌డింది.

43 ఏళ్లు దాటినా కూడా ఇంకా పెళ్లి చేసుకోకుకుండా ఒంటరి జీవితాన్ని గ‌డుపుతోంది. అయితే ఏజ్ బార్ అవుతున్నా ఇంకా మ్యారేజ్ చేసుకోక‌పోవ‌డానికి కార‌ణం ఏంటో స్నిగ్ధ తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో వివ‌రించింది. తనకు పెళ్లిపై నమ్మకం లేదని, పెళ్లి చేసుకోవాలనే ఫీలింగ్ త‌న‌కు ఎప్పుడూ కలగలేదని స్నిగ్ధ పేర్కొంది. పెళ్లి చేసుకుంటే తాను మరొకరి ఆధీనంలోకి వెళ్ళిపోతాన‌ని, అందుకే మ్యారేజ్ చేసుకోవడం త‌న‌కు ఇష్టం లేద‌ని స్నిగ్ధ వెల్ల‌డించింది.

అలాగే వివాహం చేసుకొని ఆ తర్వాత పిల్లలు కని లైఫ్ మొత్తం వారి చుట్టూ తిరిగే బదులు.. హాయిగా సంపాదించిన దాంట్లో కొంత మనకోసం, కొంత అనాధశ్రమాల కోసం ఖర్చు పెట్టడమే బెటర్ అనిపించింది. అప్పుడు తాను హ్యాపీ, ఆ పిల్లలు కూడా బాగుపడతారు. ప్రస్తుతం తాను అలాంటి పనే చేస్తున్నానంటూ స్నిగ్ధ పేర్కొంది. ఇక‌పోతే గ‌తంలో ఓ కార్యక్రమంలో చిన్న వ‌య‌సులో త‌న‌కు ఎదురైన చేదు అభ‌వాన్ని బయటపెట్టింది. ఐదో తరగతిలో ఉన్న‌ప్పుడు ఆడుకోవడానికి ఇందిరా పార్క్‌లో వెళ్తే ఒకడు చెయ్యి ప‌ట్టుకుని పక్కకు లాక్కెళ్లాడ‌ని.. ఆ ఘ‌ట‌న త‌న‌ను చాలా కాలం భ‌య‌పెట్టింద‌ని స్నిగ్ధ పేర్కొంది. భరిస్తున్నంత కాలం ఇలాంటివి జరుగుతూనే ఉంటాయ‌ని.. ప్ర‌తి అమ్మాయి ఎదురుతిరగాల‌ని స్నిగ్ధ తెలిపింది.

Related posts

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Karthika Deepam 2 May 6th 2024 Episode: శోభ ఆస్తులకు లొంగిపోయి దీపను రోడ్డు పాలు చేసిన అనసూయ.. బోరుమని ఏడ్చిన దీప..!

Saranya Koduri

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

Brahmamudi May 6 Episode 402:సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేసిన రాజ్.. బిడ్డ రహస్యం తెలుసుకున్న కావ్య.. రుద్రానికి కోటి అప్పు..

bharani jella

Nuvvu Nenu Prema May 6 Episode 616:కృష్ణ గురించి నిజం తెలుసుకొని చేయి చేసుకున్న అరవింద.. కృష్ణ మరో ప్లాన్.. విక్కీ నిర్ణయం..

bharani jella

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju