Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో మొట్టమొదటి ఎలిమినేట్ అయిన మగ కంటెస్టెంట్ ఆట సందీప్. అంతేగాని తొలి ఏడూ వారాలలో సందీప్ నామినేషన్ లోకి రాలేదు. అయితే ఎనిమిదో వారంలో ఫస్ట్ టైం నామినేషన్ లోకి వచ్చిన సందీప్ ఎలిమినేట్ కావడం జరిగింది. హౌస్ లో ప్రారంభంలో అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించాడు. తొలి 5 వారాలు ఎనిమిటి పొందుకున్న కంటెస్టెంట్ గా నిలిచాడు. దాదాపు 60 రోజులపాటు బిగ్ బాస్ ఇంట్లో సందడి చేయడం జరిగింది. ఇదిలా ఉంటే ఎలిమినేట్ అయిన తర్వాత తోటి హౌస్ మేట్స్ పై సందీప్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
మేటర్ లోకి వెళ్తే బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో తనలో ఉన్న మరో కోణాన్ని చూపించారు. ఈ క్రమంలో శివాజీ ఇంకా అర్జున్ లపై ఓ రేంజ్ లో సీరియస్ కామెంట్లు చేశారు. శివాజీ తేనె పూసిన కత్తిలాగా మాట్లాడీ నన్ను కెప్టెన్సీ నుంచి తప్పించాడు. శివాజీ 8 వారాల ఆటలు మొదటి రెండు వారాలు తప్పితే మిగిలిన ఆరువారాలు పెద్దగా ఏమీ ఆడలేదని చెప్పుకొచ్చారు. అంతేకాదు తానే ప్రశాంత్, యావర్ లను కెప్టెన్సీ చేసినట్లు ఫీల్ అవుతాడని కానీ వాళ్ళ ఆట తీరుతోనే కెప్టెన్లు అయ్యారని సందీప్ చెప్పుకొచ్చారు.
హౌస్ లో అర్జున్ అడుగుపెట్టినప్పటి నుంచి గమనిస్తే నా అంత తోపు స్ట్రాంగ్ హైట్ ఎవడు లేడు అని అనుకుంటున్నాడు. కానీ అన్నిటికీ కండబలం మాత్రమే కాదు బుద్ధి బలం కూడా ఉండాలి. అయితే అర్జున్ కి రెండు ఉన్నాయని అనుకుంటాడు కానీ.. అంత సీన్ లేదు అంటూ.. అర్జున్ ఆట తీరుపై సెటైర్లు వేశారు. హౌస్ లో ఉన్న సభ్యులలో ప్రియాంక ఆట తీరు చాలా బాగుంది. అందరితోనూ ఆమె చాలా పాజిటివ్ గా ఉంటుంది. నా పరంగా టాప్ త్రీలో ప్రశాంత్, అమర్, ప్రియాంక ఉంటారంటూ సందీప్ తన అభిప్రాయాన్ని తెలియజేశారు.