Pawan Kalyan: ఇటలీలో గ్రాండ్ గా కుటుంబ సభ్యుల మధ్య మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. లావణ్య త్రిపాఠీల వివాహం జరిగిన సంగతి తెలిసిందే. సరిగ్గా నవంబర్ మొదటి తారీకు మధ్యాహ్నం ఇటలీలో లావణ్య త్రిపాఠికి వరుణ్ తేజ్ మూడు ముళ్ళు వేయడం జరిగింది. ఈ పెళ్లి వేడుకకు సంబంధించి గత వారం రోజుల నుంచి సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అవుతూ ఉన్నాయి. పెళ్లికి వారం రోజులు ముందుగానే మెగా ఫ్యామిలీలో చాలామంది ఇటలీకి వెళ్లడం జరిగింది. దీంతో వరుణ్ పెళ్లి ఫోటోలలో చాలామంది మెగా కుటుంబానికి చెందిన సెలబ్రిటీలు ఎక్కడో ఒకచోట కనిపిస్తూనే ఉన్నారు.
ఒక్క పవన్ కళ్యాణ్ ఫోటో మాత్రం పెద్దగా కనిపించలేదు. అయితే నవంబర్ మొదటి తారీకు పెళ్లి కావడంతో పవన్ ఫోటో ఏదైనా వస్తుందేమోనని.. అభిమానులు సోషల్ మీడియాలో సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. అంతేకాకుండా దీనిమీద మీమ్స్ వేస్తూ.. పవన్ ఫోటో కావాలి అంటూ అభిమానులు రచ్చ రచ్చ చేశారు. ఈ క్రమంలో తాజాగా వరుణ్ పెళ్లిలో పవన్ కళ్యాణ్ ఫోటో ఒకటి విడుదల కావడం జరిగింది. ఈ ఫోటోలో పవన్ ముఖం కనిపించకపోయినా ఆయన బ్యాక్ కనిపిస్తూ ఉంది. వరుణ్ ను పెళ్ళికొడుకుగా తయారు చేసి తీసుకెళ్తున్న సమయంలో క్లిక్ చేసిన ఈ ఫోటోలో నాగబాబు మరియు పవన్ కళ్యాణ్.. పక్కపక్కనే దర్శనమిచ్చారు.
ఈ లుక్ లో పవన్ కళ్యాణ్ మినహా అందరూ వెరైటీ డిజైన్ దుస్తులను కనిపించడం జరిగింది. ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే చాలా సింపుల్ గా ఆలివ్ కలర్ టీ షర్ట్.. కాకి కలర్ ప్యాంట్ లో కనిపించారు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. ఇది ఇలా ఉంటే నవంబర్ 5వ తారీఖు హైదరాబాద్ లో గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ మరియు రాజకీయ ప్రముఖులను నాగబాబు ఆహ్వానించారు.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!