Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఉల్టా పుల్టా అన్న రీతిలోనే.. సాగుతోంది. గత 6 సీజన్ లకు భిన్నంగా ఈ సీజన్.. ఎవరు కూడా అంచనా వేయలేని రీతిలో షో నిర్వాహకులు.. ఊహించని ట్విస్ట్ లు ఇస్తున్నారు. ఆల్రెడీ గతవారం ఐదుగురు వైల్డ్ కార్డు రూపంలో హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అయితే తాజాగా శనివారం ఎపిసోడ్ లో హౌస్ లో నుండి ఎలిమినేట్ అయిన ముగ్గురు తిరిగి రీయంట్రి ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. శనివారం ఎపిసోడ్ ప్రోమోలో హౌస్ నుండి ఎలిమినేట్ అయిన రతిక, దామిని, శుభ శ్రీలు మళ్లీ రీఎంట్రీ ఇవ్వడం జరిగింది.
దీంతో వీళ్ళ ముగ్గురిలో ఒకరు మళ్ళీ హౌస్ లో గేమ్ ఆడబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సుబ్బు హౌస్ లోకి రియంట్రీ ఇచ్చినట్లు పోటుగాళ్ల టీం లో ఆడబోతున్నట్లు సమాచారం. శనివారం ఎపిసోడ్ లో ఇంటి సభ్యులు కూడా ఊహించని రీతిలో ఎలిమినేట్ అయిన వాళ్ళు హౌస్ లోకి రావడం సంచలనం సృష్టించింది. ఇక ఇదే సమయంలో బాలకృష్ణ కొత్త సినిమా “భగవంత్ కేసరి”.. డైరెక్టర్ అనిల్ రావిపూడి హీరోయిన్ శ్రీలీలా స్టేజిపై సందడి చేశారు. బిగ్ బాస్ ఇంటి సభ్యులు చూస్తున్నా ఆడియన్స్ ఎవరు అంచనా వేయలేని రీతిలో గేమ్ సాగుతోంది.
అంతేకాదు ఆ ముగ్గురి రీ ఎంట్రీ కంటెస్టెంట్లలో.. ఒకరు ఆస్ట్రేలియా నుండి ఈ షోలో పాల్గొనటానికి ప్రత్యేకంగా రావడం జరిగింది అంట. గతవారం ఐదుగురు వైల్డ్ గార్డెన్ట్రీ ఈసారి ముగ్గురు ఎలిమినేట్ అయిన వాళ్ళు మళ్ళీ హౌస్ లోకి రావటంతో.. హౌస్ లో కష్టపడి ఆడుతున్న కంటెస్టెంట్లకు.. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది.
Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?